భారతదేశంలోని ఓ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ కూలిపోతున్న దృశ్యాలు అంటూ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

క్లెయిమ్: ఇటీవల భారతదేశంలోని ఓ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ కూలిపోతున్న దృశ్యాలు.
ఫాక్ట్(నిజం): ఈ వీడియో నిజమైన సంఘటనను చూపించడం లేదు. ఈ వైరల్ వీడియో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఉపయోగించి రూపొందించబడింది. ఈ వైరల్ వీడియో AI ద్వారా రూపొందించబడిందని పలు AI-జనరేటెడ్ కంటెంట్ డిటెక్టింగ్ టూల్స్ కూడా నిర్థారించాయి. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.
ఈ వైరల్ వీడియోను జాగ్రతగా పరిశీలిస్తే, ఇందులో పలు తప్పిదాలు/ అసమానతలు మనకు స్పష్టంగా కనిపిస్తాయి. ఈ వీడియోలో కనిపిస్తున్న వ్యక్తులు, వాహనాల కదలికలు అసహజంగా ఉండటం మనం చూడవచ్చు. అలాగే వీడియోలో కనిపిస్తున్న వ్యక్తులు పలు చోట్ల ఒకరిలో ఒకరు కలిసిపోవడాన్ని మనం చూడవచ్చు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఉపయోగించి సృష్టించబడిన దృశ్యాలలో ఇటువంటి లోపాలు సహజంగానే ఉంటాయి (ఇక్కడ, ఇక్కడ). దీన్ని బట్టి ఈ వైరల్ వీడియో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ద్వారా సృష్టించి ఉండవచ్చని తెలుస్తోంది.

ఈ వీడియోకు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోవడానికి, వైరల్ వీడియోలోని కీఫ్రేమ్‌లను రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా, ఇదే వీడియోను పలువురు ఫేస్‌బుక్‌లో షేర్ చేసినట్లు మేము కనుగొన్నాము (ఇక్కడ, ఇక్కడ, & ఇక్కడ) (ఆర్కైవ్డ్ ఇక్కడ, ఇక్కడ). ఈ పోస్టులలో, ఈ వీడియో యొక్క వివరణలో, ఈ వీడియో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఉపయోగించి రూపొందించబడిందని పేర్కొనబడింది.

తదుపరి ఈ వైరల్ వీడియో AI- ఉపయోగించి తయారు చేసిందా? లేదా? అని నిర్ధారించడానికి, Hive వంటి పలు AI-జనరేటెడ్ కంటెంట్ డిటెక్టింగ్ టూల్స్ ఉపయోగించి ఈ వైరల్ వీడియోను పరిశీలించగా, ఈ వీడియో 99.9% AI- జనరేటెడ్ కావచ్చని Hive ఫలితాన్ని ఇచ్చింది. దీన్ని బట్టి ఈ వైరల్ వీడియో AI ద్వారా రూపొందించబడిందని మనం నిర్ధారించవచ్చు.

అలాగే భారతదేశంలో ఇటీవల జరిగిన వంతెనలు కూలిపోయిన సంఘటనలను రిపోర్ట్ చేస్తూ మీడియా సంస్థలు ప్రచురించిన వార్తా కథనాలలో ఎక్కడా కూడా ఇలాంటి దృశ్యాలను లేవు.
చివరగా, భారతదేశంలో ఓ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ కూలిపోతున్న దృశ్యాలు అంటూ ఆర్టిఫిషల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి తయారు చేసిన వీడియోని షేర్ చేస్తున్నారు.