Fake News, Telugu
 

ఫోటోలో ఉన్నది ఢిల్లీలోని స్వామినారాయణ్ అక్షర్ ధామ్ ఆలయం. అయోధ్య రామ మందిర రూపం ఇంకా ఖాయం అవలేదు

0

ఫేస్బుక్ లో ఒక ఫోటో ని పెట్టి, ‘ఖాయమైన అయోధ్య రామ మందిర రూపం’ అంటూ పోస్టు చేస్తున్నారు. పోస్టులో చెప్పిన దాంట్లో ఎంతవరకు నిజముందో విశ్లేషిద్దాం.

ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: ఖాయమైన అయోధ్య రామ మందిర రూపం ఫోటో.

ఫాక్ట్ (నిజం): ఫోటో ఢిల్లీలోని స్వామినారాయణ్ అక్షర్ ధామ్ దేవాలయానిది. అంతేకాదు, అయోధ్య రామ మందిర రూపం ఇంకా ఖాయం అవలేదు. కావున, పోస్ట్ లో చెప్పింది తప్పు. 

ఫోటోని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసినప్పుడు, అందులో ఉన్నది ఢిల్లీలోని అక్షర్ ధామ్ దేవాలయం అని చాలా సెర్చ్ రిజల్ట్స్ వచ్చాయి. దాంతో, గూగుల్ మాప్స్ లో ఆ దేవాలయం ఫోటోలను చూసినప్పుడు, అందులో పోస్టులో ఉన్న ఫోటో లభించింది. ఆ ఆలయానికి సంబంధించిన మరిన్ని ఫోటోలను ఇక్కడ చూడవొచ్చు. కావున, ఫోటో అయోధ్య రామ మందిర రూపంది కాదు, అది ఢిల్లీలోని స్వామినారాయణ్ అక్షర్ ధామ్ దేవాలయానిది.

అయోధ్య రామ మందిర రూపం ఖాయమైందా అనే విషయం గురించి గూగుల్ లో వెతికినప్పుడు, దాన్ని ద్రువికరిస్తూ సమాచారమేమీ లభించలేదు. ‘The New Indian Express’ వారి 29 ఫిబ్రవరి 2020 కథనం ద్వారా, లార్సెన్ అండ్ టర్బో (ఎల్ అండ్ టి) సంస్థ రామ మందిర రూపకల్పన మరియు నిర్మాణాన్ని చేపట్టడానికి ముందుకొచ్చిందని, కానీ ఆ బాధ్యతని ఎవరికి ఇచ్చే విషయం మీద మార్చి మొదటి వారం లో జరగబాయే బోర్డు మీటింగ్ లో నిర్ణయం తీస్కుంటామని ‘శ్రీ రామ్ తీర్త్ క్షేత్ర ట్రస్ట్’ సభ్యుడొకరు చెప్పిన్నట్లుగా తెలుస్తుంది. కావున, ఇంకా రామ మందిర రూపకల్పన ఎవరు చేస్తారనే విషయం మీద బోర్డు నిర్ణయం తీసుకోవలసి ఉంది.

చివరగా, ఫోటోలో ఉన్నది ఢిల్లీలోని స్వామినారాయణ్ అక్షర్ ధామ్ ఆలయం. అయోధ్య రామ మందిర రూపం ఇంకా ఖాయం అవలేదు.

‘మీకు తెలుసా’ సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?

Share.

About Author

Comments are closed.

scroll