Deepfake, Fake News, Telugu
 

అమెరికా B-2 బాంబర్‌ను ఇరాన్ కూల్చివేసిందని పేర్కొంటూ AI-జనరేటెడ్ ఫోటోలను షేర్ చేస్తున్నారు

0

ఇరాన్ అణ్వాయుధాలు తయారు చేసుకునే దిశగా ముందుకు వెళ్లకుండా నిరోధించడానికి, 13 జూన్ 2025న, ఇజ్రాయెల్ “ఆపరేషన్ రైజింగ్ లయన్” పేరుతో ఇరాన్ అణు, సైనిక ప్రదేశాలు లక్ష్యంగా చేసుకొని వైమానిక దాడులు, డ్రోన్ దాడులను చేసింది. ఈ దాడుల్లో పలువురు అగ్రశ్రేణి ఇరాన్ సైనిక అధికారులు, అణు శాస్త్రవేత్తలు హతమయ్యారు (ఇక్కడఇక్కడ, & ఇక్కడ). ఇజ్రాయెల్‌ ‘ఆపరేషన్‌ రైజింగ్‌ లయన్‌’కు కౌంటర్‌గా ‘ఆపరేషన్‌ ట్రూ ప్రామిస్‌ -3’ని ఇరాన్‌ ప్రారంభించింది. ప్రతీకార దాడిలో భాగంగా, ఇరాన్ టెల్ అవీవ్, జెరూసలేం మరియు హైఫా నగరాలను లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్‌పై వందలాది బాలిస్టిక్ క్షిపణులు మరియు డ్రోన్‌లను ప్రయోగించింది (ఇక్కడఇక్కడ). 22 జూన్ 2025న, అమెరికా ఇరాన్‌లోని ఫోర్దో, నతాంజ్, ఇస్ఫహాన్ అణు స్థావరాలపై B-2 బాంబర్‌లతో బాంబు దాడులు చేసింది (ఇక్కడఇక్కడ, & ఇక్కడ).

ఈ నేపథ్యంలో,“ఇరాన్ అమెరికా B-2 స్టెల్త్ బాంబర్‌ను కూల్చివేసింది” అంటూ రెండు ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ, & ఇక్కడ). ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

ఈ పోస్టుల యొక్క వెర్షన్‌లను ఇక్కడ & ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: అమెరికాకు చెందిన B-2 స్టెల్త్ బాంబర్‌ను ఇరాన్ కూల్చివేసిన దృశ్యాలు.

ఫాక్ట్(నిజం): వైరల్ అవుతున్న ఈ ఫోటోలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఉపయోగించి సృష్టించబడ్డాయి. పలు AI-జనరేటెడ్ ఇమేజెస్ డిటెక్టింగ్ టూల్స్ ఈ ఫోటోలు AI-జనరేటెడ్ ఫోటోలు అని నిర్ధారించాయి. అంతేకాకుండా, ఇరాన్ అమెరికా B-2 స్టెల్త్ బాంబర్‌ను కూల్చివేసినట్లు ఎటువంటి విశ్వసనీయ రిపోర్ట్స్ లేవు. 22 జూన్ 2025న ఇరాన్‌పై అమెరికా చేసిన దాడిలో అన్ని B-2 స్టెల్త్ బాంబర్‌లు సురక్షితంగా తిరిగి వచ్చాయని US అధికారిక వర్గాలు పేర్కొన్నాయి. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.

ముందుగా వైరల్ పోస్టులో పేర్కొన్నట్లుగా, అమెరికా B-2 బాంబర్‌ను ఇరాన్ కూల్చివేసిందా? అని తగిన కీవర్డ్స్ ఉపయోగించి ఇంటర్నెట్‌లో వెతకగా, ఇరాన్ అమెరికా B-2 స్టెల్త్ బాంబర్‌ను కూల్చివేసినట్లు ఎటువంటి విశ్వసనీయ రిపోర్ట్స్/ఆధారాలు లభించలేదు. ఇరాన్ కూడా తాము అమెరికా B-2 స్టెల్త్ బాంబర్‌ను కూల్చివేసినట్లు ప్రకటించలేదు. ఈ క్రమంలోనే, 22 జూన్ 2025న ఇరాన్‌పై అమెరికా చేసిన దాడిలో అన్ని B-2 స్టెల్త్ బాంబర్‌లు సురక్షితంగా తిరిగి వచ్చాయని US అధికారిక వర్గాలు పేర్కొన్నట్లు పలు రిపోర్ట్స్ లభించాయి (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ, & ఇక్కడ).

ఈ వైరల్ ఫోటోలను జాగ్రతగా పరిశీలిస్తే, వీటిలో పలు తప్పిదాలు/ అసమానతలు మనకు స్పష్టంగా కనిపిస్తాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఉపయోగించి సృష్టించబడిన దృశ్యాలలో ఇటువంటి లోపాలు సహజంగానే ఉంటాయి (ఇక్కడఇక్కడ). అలాగే, ఈ వైరల్ ఫోటోలలో కనిపిస్తున్న B-2 బాంబర్‌ను అమెరికన్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ డిఫెన్స్ వెబ్‌సైట్‌లో ప్రచురించబడిన US వైమానిక దళం యొక్క B-2 స్పిరిట్ బాంబర్ యొక్క ఫోటోలతో  పోల్చి చూస్తే, వైరల్ ఫోటోలలో ఉన్న బాంబర్‌ విమానం, నిజమైన B-2 స్పిరిట్ బాంబర్ మధ్య వ్యత్యాసాలను మనం స్పష్టంగా గమనించవచ్చు. దీన్ని బట్టి, ఈ వైరల్ ఫోటోలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ద్వారా సృష్టించి ఉండవచ్చని తెలుస్తోంది.

తదుపరి ఈ వైరల్ ఫోటోలు AI- ఉపయోగించి తయారు చేశారా? లేదా? అని నిర్ధారించడానికి, పలు AI-జనరేటెడ్ కంటెంట్ డిటెక్టింగ్ టూల్స్ ఉపయోగించి మొదటి వైరల్ ఫోటోను పరిశీలించగా, ఈ ఫోటో 96% AI-జనరేటెడ్ కావచ్చని Cantilux ఫలితాన్ని ఇవ్వగా, ఈ ఫోటో 99% AI-జనరేటెడ్ కావచ్చని Sight engine ఫలితాన్ని ఇచ్చింది. అలాగే AI OR NOT, Is It AI? కూడా ఈ వైరల్ ఫోటో AI- జనరేటెడ్ కావచ్చని ఫలితాన్ని ఇచ్చాయి.

రెండోవ వైరల్ ఫోటోను పలు AI-జనరేటెడ్ కంటెంట్ డిటెక్టింగ్ టూల్స్ ఉపయోగించి పరిశీలించగా, ఈ ఫోటో 99% AI-జనరేటెడ్ కావచ్చని Sight engine ఫలితాన్ని ఇచ్చింది. అలాగే wasitAI, AI OR NOT, Is It AI? కూడా ఈ వైరల్ ఫోటో AI- జనరేటెడ్ కావచ్చని ఫలితాన్ని ఇచ్చాయి. దీన్ని బట్టి ఈ వైరల్ ఫోటోలు AI ద్వారా రూపొందించబడ్డాయని మనం నిర్ధారించవచ్చు.

చివరగా, అమెరికా B-2 బాంబర్‌ను ఇరాన్ కూల్చివేసిందని పేర్కొంటూ షేర్ చేస్తున్న ఈ ఫోటోలు AI ద్వారా రూపొందించబడ్డాయి.

Share.

About Author

Comments are closed.

scroll