Fake News, Telugu
 

రిషికేశ్ – కర్ణప్రయాగ్ రైల్వే లైన్ దృశ్యాలంటూ చైనాకు చెందిన వీడియోని షేర్ చేస్తున్నారు

0

ఉత్తరాఖండ్‌లోని రిషికేశ్ నుంచి కర్ణప్రయాగ్ వరకు వెళ్లే రైలు మార్గాన్ని చూపే ఒక వీడియో (ఇక్కడ, ఇక్కడ & ఇక్కడ) అంటూ సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. ఈ వీడియోలో ఒక రైలు కొన్ని సొరంగాల గుండా వెళ్లడం చూడవచ్చు. దీంట్లో ఎంత నిజముందో ఇప్పుడు చూద్దాం.

A screenshot of a phone  AI-generated content may be incorrect.
ఆర్కైవ్ పోస్టుని ఇక్కడ చూడవచ్చు

క్లెయిమ్: రిషికేశ్ నుంచి కర్ణప్రయాగ్ వరకు వెళ్లే రైలు మార్గం యొక్క వీడియో.

ఫాక్ట్: ఇది చైనాకు చెందిన వీడియో. హునాన్ ప్రొవిన్స్ లో ఉన్న యాన్బోడు పట్టణం గుండా వెళ్లే రైలు మార్గాన్ని ఈ వీడియో చూపుతుంది. కావున పోస్టులో చేయబడ్డ క్లెయిమ్ తప్పు.

ముందుగా వైరల్ వీడియోని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా, ఇవే దృశ్యాలను చూపుతున్న కొన్ని వీడియోలు (ఇక్కడ & ఇక్కడ) చైనా సోషల్ మీడియా యాప్ డోయున్ లో ఉండడం గుర్తించాం. వీటి ఆధారంగా మరింత వెతకగా, ఇదే వీడియోని అక్టోబర్ 2024లో ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, ఎక్స్(ట్విట్టర్) మొదలగు సామాజిక మాధ్యమాల్లో అప్లోడ్ చేసినట్లు గుర్తించాం. వీటిలో ఇచ్చిన వివరాల ప్రకారం, ఈ వీడియో చైనాలోని హునాన్ ప్రొవిన్స్ లో ఉన్న యాన్బోడు పట్టణం గుండా వెళ్లే రైలు మార్గాన్ని చూపుతుంది.  

ఇక, వైరల్ వీడియోలోని దృశ్యాలను గూగుల్ ఎర్త్ శాటిలైట్ దృశ్యాలతో పోల్చగా, ఈ వీడియో చైనాకి చెందినదిగా నిర్ధారించవచ్చు.

పైగా, భారతీయ రైల్వే ప్రకారం, ఉత్తరాఖండ్‌లో రిషికేశ్-కర్ణప్రయాగ్ రైల్వే లైన్ ప్రాజెక్ట్ January 2025 నాటికి నిర్మాణంలో ఉంది. 12 స్టేషన్లతో 125.20 కిలోమీటర్లు విస్తరించి ఉన్న ఈ ప్రాజెక్ట్ డిసెంబర్ 2025 నాటికి పూర్తి అవుతుందని అంచనా వేస్తున్నారు.

చివరిగా, చైనా రైలు మార్గాన్ని చూపుతున్న వీడియోని రిషికేశ్ – కర్ణప్రయాగ్ రైలు మార్గంగా తప్పుడు ప్రచారం చేస్తున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll