Deepfake, Fake News, Telugu
 

ఉత్తరప్రదేశ్‌లోని సంత్ కబీర్ నగర్ జిల్లాకు సంబంధించిన ఒక రోడ్డు ఫోటోను ఆంధ్రప్రదేశ్‌కు చెందిన రోడ్డు ఫోటోగా తప్పుగా షేర్ చేస్తున్నారు

0

ప్రస్తుత టీడీపీ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ఏర్పడటానికి ముందు, తరువాత ఆంధ్రప్రదేశ్‌లోని ఓ రోడ్డుకు సంబంధించిన దృశ్యాలు అంటూ రెండు ఫోటోలతో కూడిన ఓ పోస్టు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది (ఇక్కడ, ఇక్కడ, & ఇక్కడ). ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన ఓ రోడ్డు దృశ్యాలు.

ఫాక్ట్(నిజం): ఈ వైరల్ ఫోటోలకు ఆంధ్రప్రదేశ్‌కు ఎటువంటి సంబంధం లేదు. ఈ వైరల్ ఫోటోలలో, పైన ఉన్న ఫోటో ఉత్తరప్రదేశ్‌లోని సంత్ కబీర్ నగర్ జిల్లాలోని సెమ్రియావా బ్లాక్ పరిధిలోని ధుసురా గ్రామ పంచాయతీలో భాగమైన మదర్‌పూర్ అనే గ్రామానికి సంబంధించినది. అలాగే, క్రింద ఉన్న ఫోటో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఉపయోగించి రూపొందించబడింది. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.

ఈ వైరల్ ఫోటోలకు సంబంధించిన పూర్తి వివరాల కోసం వైరల్ పోస్టులో పైన ఉన్న ఫోటోను గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా, వైరల్ ఫోటోలోని దృశ్యాలనే చూపిస్తున్న ఫోటోను రిపోర్ట్ చేస్తూ ప్రముఖ హిందీ మీడియా సంస్థ ‘అమర్ ఉజాల’ 07 ఆగస్టు 2025న ప్రచురించిన వార్తా కథనం ఒకటి లభించింది. ఈ కథనం ప్రకారం, ఈ వైరల్ ఫోటో ఉత్తరప్రదేశ్‌లోని సంత్ కబీర్ నగర్ జిల్లాలోని సెమ్రియావా బ్లాక్ పరిధిలోని ధుసురా గ్రామ పంచాయతీలో భాగమైన మదర్‌పూర్ అనే గ్రామంలోని ఓ రోడ్డును పరిస్థితిని చూపిస్తుంది.

ఈ క్రమంలోనే ఈ వైరల్ ఫోటో ఉత్తరప్రదేశ్‌లోని సంత్ కబీర్ నగర్ జిల్లాలోని మదర్‌పూర్ అనే గ్రామంలోని ఓ రోడ్డు పరిస్థితిని చూపిస్తుందని పేర్కొంటూ ‘దైనిక్ భాస్కర్’ ఇటీవల 05 ఆగస్టు 2025న ప్రచురించిన వార్తా కథనం లభించింది.

తదుపరి, ఈ వైరల్ ఫోటో సంత్ కబీర్ నగర్ జిల్లాలోని మదార్‌పూర్ గ్రామానికి సంబంధించిందా? కాదా? అని నిర్ధారించడానికి, మేము ధుసురా గ్రామ పంచాయతీ సెక్రటరీ అస్తివ్తా గోస్వామిని, మదార్‌పూర్ గ్రామస్తులను సంప్రదించాము, మాతో (Factly) మాట్లాడుతూ, వారు ఈ ఫోటో మదర్‌పూర్ గ్రామానికి సంబంధించినదని ధృవీకరించారు. దీన్ని బట్టి ఈ ఫోటోకు ఆంధ్రప్రదేశ్‌కు ఎటువంటి సంబంధం లేదని మనం నిర్ధారించవచ్చు.

ఇకపోతే వైరల్ పోస్టులో క్రింద ఉన్న ఫోటోను జాగ్రతగా పరిశీలిస్తే, ఈ ఫోటో అసహజంగా ఉండటం మనం చూడవచ్చు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఉపయోగించి సృష్టించబడిన దృశ్యాలలో ఇటువంటి లోపాలు సహజంగానే ఉంటాయి (ఇక్కడఇక్కడ). దీన్ని బట్టి ఈ వైరల్ వీడియో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ద్వారా సృష్టించి ఉండవచ్చనే అనుమానంతో, ఈ ఫోటో AI- ఉపయోగించి తయారు చేసిందా? లేదా? అని నిర్ధారించడానికి, AI or NOT వంటి పలు AI-జనరేటెడ్ కంటెంట్ డిటెక్టింగ్ టూల్స్ ఉపయోగించి ఈ వైరల్ ఫోటోను పరిశీలించగా, ఈ ఫోటో AI- జనరేటెడ్ కావచ్చని AI or NOT  ఫలితాన్ని ఇచ్చింది. దీన్ని బట్టి ఈ వైరల్ ఫోటో AI ద్వారా రూపొందించబడిందని మనం నిర్ధారించవచ్చు.

చివరగా, ఉత్తరప్రదేశ్‌లోని సంత్ కబీర్ నగర్ జిల్లాకు సంబంధించిన ఒక రోడ్డు ఫోటోను ఆంధ్రప్రదేశ్‌కు చెందిన రోడ్డు ఫోటోగా తప్పుగా షేర్ చేస్తున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll