Fake News, Telugu
 

2011లో కాంగ్రెస్ హయాంలో రష్యా భగవద్గీతను నిషేధించిందని చెప్తూ తప్పుదోవ పట్టించే గ్రాఫిక్ సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు

0

డిసెంబర్ 2025లో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత పర్యటన సందర్భంగా, ప్రధాని నరేంద్ర మోదీ ఆయనకు భగవద్గీతను బహుమానంగా ఇచ్చారు (ఇక్కడ, ఇక్కడ). ఈ సందర్భంగా 2011లో కాంగ్రెస్ హయాంలో రష్యా భగవద్గీతను నిషేధించిందని, ఇప్పుడేమో మోదీ ఏకంగా ఆ దేశ అధ్యక్షుడికే భగవద్గీతను బహుకరించారని చెప్తున్న గ్రాఫిక్ (ఇక్కడ, ఇక్కడ) ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అసలు, ఈ క్లెయిమ్ వెనుక ఉన్న నిజానిజాలు ఏంటో ఈ ఆర్టికల్ ద్వారా చూద్దాం. 

ఈ క్లెయిమ్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ మీరు ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో 2011లో రష్యా భగవద్గీతను నిషేధించింది.

ఫ్యాక్ట్(నిజం): జూన్ 2011లో రష్యాలోని సైబీరియాలో ఉన్న టామ్స్క్ నగరంలో కొందరు ప్రాసిక్యూటర్‌లు ‘భగవద్గీత As it is,’ అనే పుస్తకాన్ని బహిష్కరించాలని కోర్టును సంప్రదించారు. అయితే దీన్ని కోర్టు నిరాకరించింది. కేసు నడిచింది ‘భగవద్గీత As it is’ అనే పుస్తకం పైన, భగవద్గీతపైన కాదు. దీన్ని ఇస్కాన్(ISKON) స్థాపకుడు  A. C భక్తివేదాంత స్వామి ప్రభుపాద రచించారు. కావున, ఈ పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పుదోవ పట్టించేలా ఉంది.

ఈ క్లెయిమ్ వెనుక ఉన్న నిజానిజాలు తెలుసుకోవడానికి తగిన కీవర్డ్స్ ఉపయోగించి ఇంటర్నెట్‌లో వెతకగా, 2011లో ‘భగవద్గీత As it is’ అనే పుస్తకాన్ని బహిష్కరించాలని కోరుతూ కొందరు ప్రాసిక్యూటర్‌లు రష్యాలోని సైబీరియాలో ఉన్న టామ్స్క్ నగరంలో ఉన్న ఒక కోర్టుని సంప్రదించారు చెప్తున్న వార్తా కథనాలు మాకు లభించాయి  (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ).  ఆ సమయంలో కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో ఉన్న UPA కేంద్రంలో అధికారంలో ఉంది, అప్పుడు మన్మోహన్ సింగ్ ప్రధాని.

ఈ వార్తా కథనాల ప్రకారం, జూన్ 2011లో టామ్స్క్ నగరంలో ఉన్న లెనిన్‌స్కీ జిల్లా కోర్టులో ఇస్కాన్(ISKON-International Society for Krishna Consciousness) స్థాపకుడు  A. C భక్తివేదాంత స్వామి ప్రభుపాద రచించిన భగవద్గీత As it is అనే పుస్తకం యొక్క రష్యన్ భాష అనువాదాన్ని నిషేధించాలని కొందరు ప్రాసిక్యూటర్‌లు కోరారు. ఇందులో ఇతర మతాల పట్ల ద్వేషాన్ని రెచ్చగోట్టే కామెంటరీ ఉందని వారి వాదించారు.

ఈ కేసు కారణంగా అప్పట్లో భారతదేశంలో నిరసనలు జరిగాయి. ఈ విషయంపై భారత ప్రభుత్వం వెంటనే దృష్టి సారించాలని కొందరు పార్లమెంటు సభ్యులు అప్పటి ప్రభుత్వాన్ని కోరారు

అయితే, ఈ కేసు, A. C భక్తివేదాంత స్వామి ప్రభుపాద రచించిన ‘భగవద్గీత As it is’ అనే పుస్తకం మీద కానీ, భగవద్గీతపై కాదని రష్యా విదేశాంగ శాఖ 2011లో చెప్పింది (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ).

డిసెంబర్ 2011లో  ఈ పుస్తకాన్ని నిషేదించ కూడదు అని ఆ కోర్టు తీర్పుని ఇచ్చింది (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ). 

ఈ తీర్పుపై మార్చ్ 2012లో చేసిన ఒక అప్పీల్‌ను టామ్స్క్ రిజనల్ కోర్టు తిరస్కరించింది (ఇక్కడ, ఇక్కడ). 

చివరగా, 2011లో కాంగ్రెస్ హయాంలో రష్యా భగవద్గీతను నిషేధించిందని చెప్తూ తప్పుదోవ పట్టించే గ్రాఫిక్ సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll