తమకు జీతాలు ఇవ్వట్లేదని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ పాడె మోస్తున్న ఆశా వర్కర్లు అని చెప్తూ ఒక ఫోటోతో ఉన్న పోస్ట్ ని ఫేస్బుక్ లో చాలా మంది షేర్ చేస్తున్నారు. ఆ పోస్ట్ లో ఎంతవరకు నిజముందో విశ్లేషిద్ధాం.
క్లెయిమ్ : జీతాలు ఇవ్వట్లేదని జగన్ పాడె మోస్తున్న ఆశా వర్కర్లు.
ఫాక్ట్ (నిజం): పాడె మోస్తున్న ఫోటో 2015 లో తెలంగాణ ప్రభుత్వం తమ డిమాండ్లు అంగీకరించనందుకు నిజామాబాద్ లో ఆశా వర్కర్లు చేసిన ర్యాలీ కి సంబంధించినది. జగన్ కి ఆ ర్యాలీ కి ఎటువంటి సంబంధం లేదు. కావున పోస్ట్ లో చెప్పింది తప్పు.
పోస్ట్ లో పాడె మోస్తున్న ఫోటోని క్రాప్ చేసి గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ లో వెతకగా, అదే ఫోటోతో ఉన్న ‘The Hindu’ ఆర్టికల్ ఒకటి సెర్చ్ రిజల్ట్స్ లో వస్తుంది. ఆ ఆర్టికల్ లో పాడె మోస్తున్న ఫోటో 2015 లో తీసినట్టు ఉంటుంది. తమ డిమాండ్లను ప్రభుత్వం అంగీకరించనందుకు, ఆశా వర్కర్లు నిజామాబాద్ లో తెలంగాణ ప్రభుత్వం బొమ్మని పాడె మోసారు. తెలంగాణ లో జరిగిన ఈ ర్యాలీ కి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ కి ఎటువంటి సంబంధం లేదు.
చివరగా, 2015 లో తెలంగాణ లో తీసిన ఫోటో పెట్టి ‘జగన్ పాడె మోస్తున్న ఆశా వర్కర్లు’ అని తప్పుగా ప్రచారం చేస్తున్నారు.
ఏది ఫేక్, ఏది నిజం సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?