రాజీవ్ గాంధీ విహార యాత్ర కథ అంటూ ఒక ఆర్టికల్ తో కూడిన పోస్ట్ ని ఫేస్బుక్ లో కొంత మంది షేర్ చేస్తున్నారు. ఆ పోస్ట్ లో ఎంతవరకు నిజముందో విశ్లేషిద్ధాం.
క్లెయిమ్ (దావా): రాజీవ్ గాంధీ ప్రభుత్వ సొమ్మును విహారయాత్రలకు ఖర్చు చేసాడు.
ఫాక్ట్ (నిజం): ఇండియా టుడే ఆర్టికల్ ఆధారంగా రాసిన ఈ కథలో రాజీవ్ గాంధీని సమర్దించే సమాచారం మాత్రం తీసుకోలేదు. విహార యాత్ర కి సంబందించిన బిల్ల్స్ తనకు పంపివమని రాజీవ్ అన్నట్టుగా ఇండియా టుడే ఆర్టికల్ లో చూడవచ్చు. అది ముచ్చట ఆర్టికల్ లో ఉండదు. కావున ఒరిజినల్ ఆర్టికల్ నుండి కొన్ని భాగాలే తీసుకొని ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు.
పోస్ట్ లో ఇచ్చిన ఆర్టికల్ చదువుతే, దాంట్లోనే ఇండియా టుడే ఆర్టికల్ లింక్ ఉంటుంది. ఆ ఆర్టికల్ చదువుతే పోస్ట్ లో లింక్ చేసిన ఆర్టికల్ లో కంటే ఇంకా ఎక్కువ సమాచారం ఉంటుంది. ఇండియా టుడే ఆర్టికల్ లో రాజీవ్ గాంధీ విహార యాత్ర కి ఐన ఖర్చుకు సంబంధించిన బిల్ల్స్ ను తనకు పంపమని చెప్పినట్టు ఉంటుంది. కానీ ఆ విషయం ముచ్చట ఆర్టికల్ లో ఉండదు. కొన్ని అధికారిక సౌకర్యాలను, దేశ రక్షణ కోసం వాడే యుద్ధ నౌకను రాజీవ్ ఉపయోగించిన విషయం ఇండియా టుడే ఆర్టికల్ ప్రకారం నిజమే. కాకపోతే వీటితో పాటు ఇండియా టుడే ఆర్టికల్ లో రాజీవ్ విహార యాత్ర వళ్ళ లక్షద్వీప్ లో టూరిజం పెరిగిందని ఉంటుంది. కానీ ఇటువంటి విషయాలు ఏవి ముచ్చట ఆర్టికల్ లో ఉండవు.
చివరగా, రాజీవ్ విహార యాత్ర మీద ఇండియా టుడే రాసిన ఆర్టికల్ నుండి కొన్ని భాగాలే తీసుకొని ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు.