ఫేస్బుక్ లో ‘ఏంటి ఈ దారుణం ఆకలి తట్టుకోలేక ప్రసాదం కోసం చర్చలోకి వెళ్లారని హిందూ పిల్లలను ఇలా సగం గుండు గీసి చేట్టుకు కట్టి కొట్టిన వారిని మనుషులంటారా..!!!’ అంటూ పెట్టిన ఒక పోస్ట్ ని చాలా మంది షేర్ చేస్తున్నారు. ఈ పోస్ట్ లో ఎంతవరకు వాస్తవాలు ఉన్నాయో ఓసారి విశ్లేషిద్దాం.
క్లెయిమ్ (దావా): ఆకలి తట్టుకోలేక ప్రసాదం కోసం చర్చలోకి వెళ్లారని హిందూ పిల్లలను గుండు గీసి చేట్టుకు కట్టి కొట్టారు .
ఫాక్ట్ (నిజం): ఈ ఫోటో 2016 నుండి అనేక కథనాలతో సోషల్ మీడియాలో సర్క్యూలేషన్ లో ఉంది. మళ్ళీ ఇప్పుడు చర్చి లో ప్రసాదం అడిగినందుకు హిందూ పిల్లలను గుండు గీసి చెట్టుకు కట్టి కొట్టారు అంటూ తప్పుదోవ పట్టిస్తున్నారు.
పోస్ట్ లో పెట్టిన ఫోటోని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసినప్పుడు ఫేస్బుక్ మరియు ట్విట్టర్ లో అనేక కథనాలతో ఈ ఫోటో పెట్టబడినట్టుగా గుర్తించబడింది. ఒక కథనం లో ఒడిశా దళిత పిల్లలు నీటి బావిని తాకినందుకు వారిని శిక్షించారని ఆరోపించారు. మరో కథనంలో మాధేశీలు (నేపాల్ లో భారత సంతతికి చెందిన వాళ్ళు) ని అక్కడి అగ్ర వర్ణాల వారు కొడుతూ వారిని కించపరుస్తున్నారు అంటూ ఆరోపించారు. ఇలా ఆ ఫోటోని ఉపయోగించిన అనేక కథనాలతో కూడిన ఆర్టికల్ ని Dorje’s Dooing అనే వెబ్సైట్ పొందుపరిచింది. దీని ప్రకారం ఈ ఫోటోని మొట్టమొదటిసారి జులై 24, 2016న Pravir K Roy అనే వ్యక్తి ట్విట్టర్ లో ‘బాంగ్లాదేశ్ లో అన్నం దొంగిలించినందుకు గాను పిల్లలని కట్టేసి అర గుండు గీసారు’ అంటూ ట్వీట్ చేశారు.
చివరగా, మూడు సంవత్సరాల క్రితం ఫోటో ని ఇప్పుడు మళ్ళీ వేరే కథనంతో పెట్టి తప్పుదోవ పట్టిస్తున్నారు.
1 Comment
Pingback: “தெருவுக்குள் நுழைந்ததால் தலித் சிறுவர்கள் தாக்கப்பட்டனர்!” – ஃபேஸ்புக் பதிவு உண்மையா? | FactCrescendo