“ వెస్ట్ బెంగాల్ లో బిజెపి కార్యకర్తల పరిస్థితి ఇది…..ఎంత కొట్టిన ఆ కార్యకర్త నోటి నుండి ఒక్కటే మాట…ఒక్కసారి మీరే వినండి….” అంటూ ఒక వీడియో సోషల్ మీడియా లో బాగా వైరల్ అవుతోంది. దీంట్లో ఎంత నిజముందో చూద్దాం.
క్లెయిమ్ (దావా): వెస్ట్ బెంగాల్ లో బిజెపి కార్యకర్తల పై పోలీసుల దౌర్జన్యం.
ఫాక్ట్ (నిజం): 2017 లో వెస్ట్ బెంగాల్ లోని ఆసన్సోల్ బీజేపీ ఐటీ సెల్ సెక్రటరీ తరుణ్ సేన్ గుప్త ఇదే వీడియో షేర్ చేసినప్పుడు, ఈ ఘటనకు వెస్ట్ బెంగాల్ కు సంబంధం లేదని, ఫేక్ వీడియోప్రచారం చేసినందుకు గాను తనను అరెస్ట్ కూడా చేసారు. ఇప్పుడే ఇదే వీడియోని మళ్ళీ తెలుగులో ప్రచారం చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు.
పోస్ట్ లో ఉన్న వీడియో ని Invid టూల్ లో కీఫ్రేమ్స్ గా విభజించి Yandex లో రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసి చూస్తే, 2017 లో ఇదే వీడియో ని షేర్ చేసి మత కల్లోలాలు సృష్టించే ప్రయత్నం చేసినందుకు వెస్ట్ బెంగాల్ లోని ఆసన్సోల్ బీజేపీ ఐటీ సెల్ సెక్రటరీ తరుణ్ సేన్ గుప్త ని అరెస్ట్ చేసిన న్యూస్ వీడియో వస్తుంది. ఇదే వీడియో మొదటి సారి 2014 లో యూట్యూబ్ లో పోస్ట్ చేసారు. 2017 లో ఉత్తర్ ప్రదేశ్ పోలీసుల దౌర్జన్యం అంటూ కూడా ఇదే వీడియో ప్రచారం చేసారు. వెస్ట్ బెంగాల్ CID వాళ్ళు తమ ట్విట్టర్ లో ఫేక్ న్యూస్ ప్రచారం చేసినందుకు, ఇదే వీడియో ఫేస్బుక్ లో పెట్టినందుకు తరుణ్ సేన్ గుప్త ని అరెస్ట్ చేసిన విషయం 2017 లో ట్వీట్ చేసారు.
Tarun Sengupta, Secretary BJP IT Cell, Asansol, WB, arrested today for spreading fake news and creating communal disharmony. pic.twitter.com/GRWSPPnMq5
— CID West Bengal (@CIDWestBengal) July 12, 2017
కావున ఈ వీడియో వెస్ట్ బెంగాల్ కి సంబంచినది కాదు. 2014 నుంచి ఈ వీడియోని వివిధ సందర్భాలలో ప్రచారం చేస్తున్నారు.
ఏది ఫేక్, ఏది నిజం సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?