ఉపరాష్ట్రపతి హోదాలో ఉంటూ కూడా హమీద్ అన్సారీ జాతీయ పతాకానికి సెల్యూట్ చేయలేదని చెప్తూ ఒక ఫోటోతో కూడిన పోస్ట్ ని ఫేస్బుక్ లో చాలా మంది షేర్ చేస్తున్నారు. ఆ పోస్ట్ లో ఎంతవరకు నిజముందో విశ్లేషిద్ధాం.
క్లెయిమ్ (దావా): ఉపరాష్ట్రపతిగా ఉంటూ కూడా జాతీయ పతాకానికి సెల్యూట్ చేయని హమీద్ అన్సారి.
ఫాక్ట్ (నిజం): 2015 లో ఈ విషయం వైరల్ అయినప్పుడే ఉపరాష్ట్రపతి ఆఫీసు వారు ప్రోటోకాల్ ప్రకారం ఉపరాష్ట్రపతి కేవలం ‘Principal Dignitory’ గా ఉన్నప్పుడే టోపీ పెట్టుకొని సెల్యూట్ చేస్తారని, మిగిలిన సమయాల్లో శ్రద్ధగా నిలబడుతారని తెలిపారు. కావున పోస్ట్ లో జాతీయ పతాకానికి సెల్యూట్ చేయకుండా హమీద్ అన్సారీ అగౌరవపరుస్తున్నారని తప్పుదోవ పట్టిస్తున్నారు.
పోస్ట్ లో విషయం గురించి వెతకగా పోస్ట్ లోని ఫోటో 2015 రిపబ్లిక్ డే కి సంబంధించిందని తెలుస్తుంది. అప్పట్లోనే ఈ ఫోటో వైరల్ అవ్వడంతో ఉపరాష్ట్రపతి ఆఫీసు వారు వివరణ ఇచ్చినట్టు ‘The Hindu’ ఆర్టికల్ లో చూడవచ్చు. ఈ విషయం పై గుర్దీప్ సింగ్ (అప్పటి ఉపరాష్ట్రపతి OSD) 2015 లోనే ట్వీట్ చేసి ప్రోటోకాల్ ప్రకారం ఉపరాష్ట్రపతి కేవలం ‘Principal Dignitary’ గా ఉన్నప్పుడే టోపీ పెట్టుకొని సెల్యూట్ చేస్తారని, మిగిలిన సమయాల్లో శ్రద్ధగా నిలబడుతారని తెలిపాడు. రిపబ్లిక్ డే నాడు రాష్ట్రపతి ‘Principal Dignitary’ గా వ్యవహరిస్తారు కాబట్టి హమీద్ అన్సారీ సెల్యూట్ చేయలేదని తెలిపారు. అంతే కాదు, జాతీయ గీతం వచ్చినప్పుడు ‘Principal Dignitary’ మరియు యూనిఫామ్ ధరించిన వారు సెల్యూట్ చేస్తారని, మిగితా పౌరులు గౌరవంతో నిలబడుతారని తెలిపాడు.
‘Flag Code of India – 2002’ సెక్షన్-6 లో కూడా సెల్యూట్ కి సంబంధించి ఉన్న ప్రోటోకాల్ చూడవచ్చు. మరొక ట్వీట్ లో హమీద్ అన్సారి ఒక కార్యక్రమంలో జాతీయ గీతానికి సెల్యూట్ చేస్తూ నిలబడినట్టు గుర్దీప్ సింగ్ ఒక వీడియోని ట్వీట్ చేసారు.
For my friends who believed an ill-informed diatribe. Vice President of India during National Anthem & National song https://t.co/xiwn64Rh7S
— Gurdeep Singh Sappal (@gurdeepsappal) January 27, 2015
కేవలం హమీద్ అన్సారీ మాత్రమే కాదు, మిగితా లీడర్స్ కూడా వివిధ సందర్భాలల్లో సెల్యూట్ చేయనట్టు వివిధ వెబ్ సైట్ లల్లో ఫోటోలు చూడవచ్చు. 65th రిపబ్లిక్ డే – మన్మోహన్ సింగ్ మరియు హమీద్ అన్సారి సెల్యూట్ చేయనట్టు చూడవచ్చు.
67th మరియు 69th రిపబ్లిక్ డే – మోడీ సెల్యూట్ చేయనట్టు కూడా చూడవచ్చు.
అంతే కాదు, రాష్టపతి అబ్దుల్ కలాం సెల్యూట్ చేసినప్పుడు వాజపేయి సెల్యూట్ చేయనట్టు ఉన్న ఫోటో ఫస్ట్ పోస్ట్ ఆర్టికల్ లో చూడవచ్చు.
ఇలాంటి ఇంకొన్ని ఉదాహరణలు డెక్కన్ క్రానికల్ ఆర్టికల్ లో చూడవచ్చు. చివరగా, హమీద్ అన్సారీ ప్రోటోకాల్ ప్రకారం సెల్యూట్ చేయ లేదు. ప్రోటోకాల్ ప్రకారం నిలబడితే చాలు. మోడీ, మన్మోహన్, వాజపేయి కూడా పలు సందర్భాల్లో సెల్యూట్ చేయలేదు.
ఏది ఫేక్, ఏది నిజం సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?