Fake News, Telugu
 

‘సెయింట్ వాలేంటీనస్’ అస్థిపంజరం ఫోటో పెట్టి ‘ఇరాక్ తవ్వకాలలో బయట పడ్డ ఆంజనేయ స్వామి’ అంటూ తప్పుగా ప్రచారం చేస్తున్నారు

0

‘ఇరాక్ త్రవ్వకాలలో బయట పడ్డ ఆంజనేయ స్వామి’ అంటూ ఒక అస్థిపంజరం ఫోటోని కొందరు ఫేస్బుక్ లో షేర్ చేస్తున్నారు. ఆ పోస్ట్ లో ఎంతవరకు నిజముందో విశ్లేషిద్ధాం.

ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: ఇరాక్ త్రవ్వకాలలో బయట పడ్డ ఆంజనేయ స్వామి ఫోటో.       

ఫాక్ట్ (నిజం): ఫోటోలో ఉన్నది రోమ్ లోని ‘కాటాకాంబ్స్’ (భూగర్భ సమాధులు) లో దొరికిన ‘సెయింట్ వాలేంటీనస్’ అస్థిపంజరం. ఈ అస్థిపంజరం ప్రస్తుతం జర్మనీ లో ఉంది. కావున పోస్ట్ లో చెప్పింది అబద్ధం.

పోస్ట్ లోని అస్థిపంజరం ఫోటోని యాన్డెక్స్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ లో వెతకగా, అదే ఫోటోతో ఉన్న ‘abc News’ ఆర్టికల్ ఒకటి సెర్చ్ రిజల్ట్స్ లో వస్తుంది. ఆ ఆర్టికల్ ద్వారా అది ‘సెయింట్ వాలేంటీనస్’ అస్థిపంజరం అని, అది ప్రస్తుతం జర్మనీ లో ఉందని తెలుస్తుంది.

అంతేకాదు, ఆ ఫోటో  “”Heavenly Bodies” అనే పుస్తకం నుండి తీసుకునట్టు ఆ ఆర్టికల్ లో ఉంటుంది. ఆ బుక్ వివరణ చూడగా, బుక్ లోని అస్థిపంజరాలు రోమ్ లోని ‘కాటాకాంబ్స్’ (భూగర్భ సమాధులు) లో దొరికినట్టు తెలుస్తుంది. ఫోటోలోని ఆస్తిపంజరం గురించి ‘DailyMail’ ఆర్టికల్ లో కూడా చూడవచ్చు. కావున, అది ఇరాక్ తవ్వకాలలో దొరకలేదు మరియు అది ఆంజనేయ స్వామికి సంబంధించినది కాదు.

చివరగా, ‘సెయింట్ వాలేంటీనస్’ అస్థిపంజరం ఫోటో పెట్టి ‘ఇరాక్ త్రవ్వకాలలో బయట పడ్డ ఆంజనేయ స్వామి’ అంటూ తప్పుగా ప్రచారం చేస్తున్నారు.

ఏది ఫేక్, ఏది నిజం సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?

Share.

About Author

Comments are closed.

scroll