Fake News, Telugu
 

సి.పి.ఐ మరియు సి.పి.ఎం పార్టీలకు జాతీయ హోదాని ఎలక్షన్ కమిషన్ ఇంకా రద్దు చేయలేదు

0

‘సిపిఐ, సిపిఎం పార్టీల కు జాతీయ పార్టీ హోదాను రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన ఎలక్షన్ కమిషన్’ అంటూ ఫేస్బుక్ లో కొంతమంది పోస్టు లు పెడుతున్నారు. ఆ ఆరోపణలో ఎంతవరకు నిజముందో విశ్లేషిద్ధాం.

ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్ : ఎలక్షన్ కమిషన్ సిపిఐ, సి.పి.ఎం పార్టీల కు జాతీయ పార్టీ హోదాను రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.    

ఫాక్ట్ (నిజం): ఎలక్షన్ కమిషన్ సిపిఐ, సి.పి.ఎం పార్టీల కు జాతీయ పార్టీ హోదాను రద్దు చేస్తూ ఎటువంటి ఉత్తర్వులు ఇంకా జారీ చేయలేదు. కావున పోస్ట్ లో చెప్పింది అబద్ధం.    

ఎలక్షన్ కమిషన్ అఫ్ ఇండియా(ఈ.సి.ఐ) వారు ప్రస్తుతం ఏడు పార్టీలకు జాతీయ పార్టీ హోదాను కలిపించినట్లుగా వారి వెబ్సైటు లో చూడొచ్చు. అందులో సిపిఐ, సి.పి.ఐ(ఎం) పార్టీలు కూడా ఉన్నాయి. సి.పి.ఐ(ఎం) పార్టీ ని వాడుకలో సి.పి.ఎం పార్టీ అని కూడా పిలుస్తారు. కావున, ఎలక్షన్ కమిషన్ సిపిఐ, సి.పి.ఎం పార్టీల కు జాతీయ పార్టీ హోదాను రద్దు చేసింది అనే ఆరోపణలో నిజం లేదు.

ఎలక్షన్ కమిషన్ అఫ్ ఇండియా ప్రకారం, ఒక రాజకీయ పార్టీ ని ‘నేషనల్ పార్టీ’ గా గుర్తించడానికి కొన్ని అర్హత్తలు కలిగి ఉండాలి. వాటి గురించి తెలుసుకోవడానికి ‘Factly’ వారు ఆ అంశం పై రాసిన కథనాన్ని ఇక్కడ చూడవచ్చు. కాకపోతే ప్రతి సాధారణ ఎన్నికల తర్వాత అర్హత సాధించని పార్టీల గుర్తింపు మీద ఎన్నికల కమిషన్ నోటీసు ఇచ్చి నిర్ణయం తీసుకుంటుంది. అటువంటి నోటీసు ఇచ్చిన తర్వాత మాత్రమే గుర్తింపు రద్దు మీద నిర్ణయం ఉంటుంది.

చివరగా, సి.పి.ఐ మరియు సి.పి.ఎం పార్టీలకు జాతీయ హోదాని ఎలక్షన్ కమిషన్ ఇంకా రద్దు చేయలేదు.

ఏది ఫేక్, ఏది నిజం సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?

Share.

About Author

Comments are closed.

scroll