ఉత్తరప్రదేశ్ లో ఒక హిందూ కుటుంబంపై ముస్లిం దుండగులు దాడి చేసారని చెప్తూ ఒక వీడియో తో కూడిన పోస్ట్ ని ఫేస్బుక్ లో చాలా మంది షేర్ చేస్తున్నారు. ఆ వీడియోలో ఎంతవరకు నిజముందో విశ్లేషిద్ధాం.
క్లెయిమ్ (దావా): హిందూ అన్నాచెల్లెళ్ళపై అమానుషంగా దాడి చేసిన ముస్లిం యువకులు.
ఫాక్ట్ (నిజం): వీడియో లో గాయపడి కనిపిస్తున్న అన్నాచెల్లెళ్ళు హిందువులు కాదు. వారు కూడా ముస్లిం మతానికి చెందినవారే. అంతే కాదు వారిని గాయపరిచిన వారిని పోలీసులు అరెస్ట్ చేసారు. కావున పోస్ట్ లో చెప్పింది అబద్ధం.
పోస్ట్ లోని విషయం గురించి గూగుల్ లో వెతకగా, లక్నో పోలీసు వారు ఈ కేసు పై ట్వీట్ చేసినట్టు తెలుస్తుంది. ఆ ట్వీట్ లో ఇదొక వీధి గొడవ అని, పిల్లల మధ్య మొదలైన గొడవ రెండు వర్గాల గొడవగా మారిందని ఉంటుంది. అంతే కాదు, వీడియో లో ఉన్న అన్నాచెల్లెళ్ళ పేర్లు షారుఖ్ మరియు షబ్నం (ముస్లింలు) అని, వారిని కొట్టిన వారి పేర్లు ఉస్మాన్, షకీల్, యూనుస్ మరియు ఇస్లాం (ముస్లింలు) అని ఆ ట్వీట్ లో ఉంటుంది.
SSP-LKO #Kalanidhi_Naithani द्वारा थाना इटौंजा की घटना को तत्काल संज्ञान में लेते हुए अभियुक्तों की गिरफ्तारी हेतु SHO इटौंजा को आदेशित किया गया था, जिसके अनुपालन में 04 नामजद अभियुक्त 1-उस्मान 02-शकील 03-युनुश 04-इस्लाम को तत्काल गिरफ्तार कर विधिक कार्रवाई की जा रही है। pic.twitter.com/J7zb39ZvZa
— LUCKNOW POLICE (@lkopolice) June 25, 2019
ఈ కేసు పై తాజా సమాచారం ఇస్తూ, లక్నో పోలీసులు దాడి చేసిన నలుగురిని అరెస్ట్ చేసినట్టు ఇంకో ట్వీట్ లో ఫోటోలు పెట్టారు.
SSP-LKO #Kalanidhi_Naithani द्वारा थाना इटौंजा की घटना को तत्काल संज्ञान में लेते हुए अभियुक्तों की गिरफ्तारी हेतु SHO इटौंजा को आदेशित किया गया था, जिसके अनुपालन में 04 नामजद अभियुक्त 1-उस्मान 02-शकील 03-युनुश 04-इस्लाम को तत्काल गिरफ्तार कर विधिक कार्रवाई की जा रही है।@Uppolice pic.twitter.com/FmzzHXd82S
— LUCKNOW POLICE (@lkopolice) June 25, 2019
తెలుగులో హిందూ అన్నాచెల్లెళ్ళపై ముస్లింలు దాడి అని వైరల్ అవుతే, ఇంగ్లీష్ లో చెల్లిపై రేప్ ని ఆపిన అన్నను కొట్టిన ముస్లిం యువకులు అని వైరల్ అయ్యింది. ఇంగ్లీష్ వెర్షన్ పై FACTLY రాసిన ఆర్టికల్ ఇక్కడ చదవచ్చు. ఈ కేసు పై ఇతర విషయలు దైనిక్ జాగరణ్ ఆర్టికల్ లో చూడవచ్చు.
చివరగా, వీడియో లో గాయపడి కనిపిస్తున్న అన్నాచెల్లెళ్ళు హిందువులు కాదు.
ఏది ఫేక్, ఏది నిజం సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?