‘కాశ్మీర్ సమస్యపై సౌదీ యువరాజు అభిప్రాయం…’ అంటూ ఒక నిమిషం నిడివి గల వీడియోని కొంత మంది షేర్ చేస్తున్నారు. తన అభిప్రాయం ప్రకారం కాశ్మీర్ హిందూ ల్యాండ్ ఆ వీడియోలో ఉన్నతను అంటాడు. అస్సలు నిజంగా సౌదీ యువరాజు ఈ వాక్యాలు చేసాడో లేదో కనుక్కుందాం.
క్లెయిమ్ : కాశ్మీర్ హిందూ ల్యాండ్ అనే అభిప్రాయం వ్యక్త పరిచిన సౌదీ యువరాజు.
ఫాక్ట్ (నిజం): వీడియోలో కాశ్మీర్ హిందూ ల్యాండ్ అని అభిప్రాయం వ్యక్త పరిచింది సౌదీ యువరాజు కాదు. తను ఇరాన్ లో పుట్టిన ఆస్ట్రేలియా షియా ముస్లిం ఇమామ్ తౌహిదీ. కావున పోస్ట్ లో చెప్పింది అబద్ధం.
పోస్ట్ లోని విషయం గురించి గూగుల్ లో ‘కాశ్మీర్ హిందూ ల్యాండ్ ’ అని వెతకగా, ఈ ఘటనకు సంబంధించిన ఆర్టికల్ సెర్చ్ రిజల్ట్స్ లో వస్తుంది. అందులో ఆ వ్యాఖ్యలు చేసింది ఇమామ్ తౌహిదీ అని తెలుస్తుంది. opindia.com కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో ఈ వ్యాఖ్యలు చేసినట్టు తెలుస్తుంది.
ఈ వివరాలతో పోస్టులో పెట్టిన వీడియో వెతకగా ఇమామ్ తౌహిదీ ఇండియా వచ్చినప్పుడు జరిగిన చర్చ వీడియో పూర్తి వీడియో నుంచి తీసుకున్నట్టు తెలుస్తుంది. ఇమామ్ తౌహిదీ ట్విట్టర్ అకౌంట్ లో కూడా తన వివరాలు తెలుస్తాయి.
చివరగా, వీడియోలో కాశ్మీర్ హిందూ ల్యాండ్ అని అభిప్రాయం వ్యక్త పరిచింది ఇరాన్ లో పుట్టిన ఆస్ట్రేలియా షియా ముస్లిం ఇమామ్ తౌహిదీ.
ఏది ఫేక్, ఏది నిజం సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?