సినిమా డైరెక్టర్ ఎస్.ఎస్. రాజమౌళి ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సందర్భంగా మార్పు రావాలి అంటూ తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా ట్వీట్ చేసాడంటూ ఉన్న ఒక పోస్ట్ ని చాలా మంది ఫేస్బుక్ లో షేర్ చేస్తున్నారు. ఆ పోస్ట్ లో ఎంతవరకు నిజముందో విశ్లేషిద్ధాం.
క్లెయిమ్ (దావా): రాజమౌళి ట్వీట్: “ఏపీ రాజధానిని ఈ ఐదేళ్ళు గ్రాఫిక్స్ లో మాత్రమే చూశాం. నిజమైన రాజధాని కావాలంటే మార్పు రావాలి.”
ఫాక్ట్ (నిజం): పోస్ట్ లో చెప్పినట్టుగా రాజధాని గురించి కానీ, మార్పు గురించి కానీ రాజమౌళి ఎటువంటి ట్వీట్ చేయలేదు. కావున పోస్ట్ లో చెప్పింది అబద్ధం.
రాజమౌళి చేసిన ట్వీట్ చూడటానికి తన ట్విట్టర్ అకౌంట్ వెతకగా పోస్ట్ లో చెప్పినట్టుగా తను రాజధాని మీద ఎన్నికల సందర్భంగా ఎటువంటి ట్వీట్ చేయలేదని తెలుస్తుంది. ఎన్నికల సమయంలో కేవలం ఓటు వేయమని చెప్తూ ఒక ట్వీట్ చేసారు. అలానే ఫేస్బుక్ లో పోస్ట్ చేసిన ట్వీట్ చూస్తే రాజమౌళి ట్విట్టర్ అకౌంట్ యొక్క ప్రొఫైల్ పిక్చర్ వేరే ఉంటుంది. కావున పోస్ట్ లో చెప్పినట్టుగా రాజధాని మీద మాట్లాడుతూ మార్పు రావాలి అంటూ రాజమౌళి ట్వీట్ చేయలేదు.
చివరగా, రాజమౌళి ‘రాజధాని కావాలంటే మార్పు రావాలి’ అంటూ ట్వీట్ చేయలేదు. అది ఒక ఫేక్ ట్వీట్.