కొంతమంది ముస్లింలు పాకిస్థాన్ జెండాని కాలుస్తున్న వీడియో ని ఫేస్బుక్ లో పోస్టు చేసి, దాని గురించి ఈ విధంగా చెప్తున్నారు- “నేడు సగౌరవంగా భారత్ మాతకీ జై అంటూ,ఆటంక్ వాది ముర్దాబాద్, వందేమాతరం అని నినదిస్తూ కాశ్మీర్ పుర వీధుల్లో ర్యాలీ నిర్వహించిన ముస్లిం సోదరులు వారి ఆనందానికి అవధులు లేని సందర్భం ఎన్నో ఏళ్ళుగా రక్తపాతాలకు నిలయమైన కల్లోల కాశ్మీరంగా పేరోందిన నేడు స్వేచ్ఛా వాయువులను, అసలైన స్వాతంత్య్రాన్ని పొందింది”. ఆ పోస్ట్ లో ఎంతవరకు నిజముందో విశ్లేషిద్ధాం.
క్లెయిమ్: ఆర్టికల్ 370 రద్దు అనంతరం కాశ్మీర్ లోని ముస్లింలు పాకిస్థాన్ జెండాని కాలుస్తున్న వీడియో.
ఫాక్ట్ (నిజం): కాశ్మీర్ లో ఆర్టికల్ 370 రద్దు ఈ సంవత్సరం ఆగష్టు 5న జరిగింది. కానీ, పోస్టు లో పెట్టిన వీడియో గత 3 సంవత్సరాలుగా సోషల్ మీడియా లో వ్యాప్తిలో ఉంది. కావున, పోస్ట్ లో పేర్కొన్న విషయం అబద్ధం.
పోస్టు లో పెట్టిన వీడియోని ‘ఇన్విడ్’ ప్లగిన్ ద్వారా విభజించగా వచ్చిన కీఫ్రేమ్స్ ని రివర్స్ ఇమేజ్ సెర్చ్ పద్ధతి ద్వారా వెతకగా, 2017 లో యూట్యూబ్ లో అప్లోడ్ చేసిన అదే వీడియో లభించింది. టైం ఫిల్టర్ పెట్టి వెతికినప్పుడు, ఆ వీడియో ని మొదట సెప్టెంబర్ 30, 2016న యూట్యూబ్ లో అప్లోడ్ చేసినట్లుగా తెలుస్తోంది. కానీ, వాటి ద్వారా ఆ వీడియో ఏ సందర్భానికి సంబంధించినదనే ఖచ్చితమైన సమాచారం తెలియలేదు.
ఫేస్బుక్ లో “Muslims burn pakistan flag murdabad slogans” అనే కీవర్డ్స్ తో వెతికినప్పుడు, ఆ వీడియో ని సెప్టెంబర్ 29, 2017న ఒక వినియోగదారుడు ‘Darul Uloom Deoband India Burns Pak flag chants Pakistan Murdabad slogan’ అనే వివరణ తో పోస్ట్ చేసినట్లుగా తెలిసింది.
ట్విట్టర్ లో కూడా కీవర్డ్స్ తో వెతికినప్పుడు, ఒక వ్యక్తి ఆ వీడియోని సెప్టెంబర్ 29, 2016న ‘Mullah’s Of Darul Uloom Deoband India burns Pakistani flag & chanting anti-Pakistan’s slogans. #PakistanZindabad’ అనే వివరణ తో ట్వీట్ పెట్టినట్లుగా తెలిసింది.
Mullah’s Of Darul Uloom Deoband India burns Pakistani flag & chanting anti-Pakistan’s slogans . #PakistanZindabad pic.twitter.com/EMdMeycLg3
— Nisar Mehdi (@nisarmehdi) September 28, 2016
‘Darul Uloom Deoband’ వారు నిజంగానే ఆ పని చేశారా అని వెతికినప్పుడు, అందుకు సంబంధించిన అధికారిక సమాచారం ఎక్కడా కూడా లభించలేదు. కావున, ఆ వీడియో యొక్క వాస్తవిక సందర్భం ఏమిటి అని తెలియనప్పటికీ, అది కాశ్మీర్ లో ఆర్టికల్ 370 రద్దు అనంతరంది కాదు అని మాత్రం తెలుస్తోంది.
చివరగా, ఒక మూడు సంవత్సరాల క్రితం వీడియోని కాశ్మీర్ లో ఆర్టికల్ 370 రద్దు అనంతరం ‘IHMO LIVE NEWS’ వీడియో అని తప్పుగా ప్రచారం చేస్తున్నారు.
ఏది ఫేక్, ఏది నిజం సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?