పుల్వామా బ్లాస్ట్ సంఘటన నేపధ్యంలో జవాన్ల మరణాల సంఖ్య మీద రాజకీయాలు మొదలయ్యాయి. ఎవరికి వారు తమ ప్రభుత్వం లో తక్కువ జవాన్లు మృతి చెందారని ప్రచారం చేసుకుంటున్నారు. ఫేస్బుక్ లో ‘మనోజ్ బాబు నూతులపాటి’ అనే అతను కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న 10 ఏళ్లలో కేవలం 171 జవాన్లు మృతి చెందారని కానీ 4 ఏళ్ల మోడీ ప్రభుత్వంలో 1250 జవాన్లు మృతి చెందారని ఒక పోస్ట్ చేసాడు. ఆ పోస్ట్ లో చేసిన ఆరోపణని విశ్లేషించడానికి ప్రయత్నిద్ధాం.
క్లెయిమ్ (దావా): కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న 10 ఏళ్లలో 171 జవాన్లు మృతి చెందారు. 4 ఏళ్ల మోడీ ప్రభుత్వంలో 1250 జవాన్లు మృతి చెందారు
ఫాక్ట్ (నిజం):జమ్మూ కాశ్మీర్ మరియు ఈశాన్య రాష్ట్రాలతో కలిపి 10 ఏళ్ల కాంగ్రెస్ ప్రభుత్వంలో మొత్తం1249 జవాన్లు వివిధ ఉగ్రవాదుల దాడుల్లో మృతి చెందారు. అలానే 4 ఏళ్ల మోడీ ప్రభుత్వం లో 378 జవాన్లు మృతి చెందారు. కావున పోస్ట్ లో చెప్పినట్టుగా పదేళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వం కంటే నాలుగేళ్ళ మోడీ ప్రభుత్వంలో ఎక్కువ జవాన్లు మృతి చెందలేదు.
చివరగా, పోస్ట్ లో చెప్పిన జవాన్ల మృతుల సంఖ్యలో ఎలాంటి నిజం లేదు.