Fake News, Telugu
 

ఫోటో లో ఉన్నది భారత సైనికుడు కాదు, రష్యా కి చెందినా స్పెషల్ ఫోర్సెస్ ఆఫీసర్

0

తీవ్ర గాయాలైనా కూడా భారత దేశ రక్షణ కోసం పోరాడటానికి సిద్ధంగా ఉన్న వీర జవాన్ అంటూ ఒక సైనికుడి ఫోటోని ఫేస్బుక్ లో చాలా మంది షేర్ చేస్తున్నారు.  ఆ పోస్ట్ లో ఎంతవరకు నిజముందో విశ్లేషిద్ధాం.

ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్ (దావా): ఫోటోలో ఉన్నది తీవ్ర గాయాలైనా కూడా భారత దేశ రక్షణ కోసం నలుగురు ఉగ్రవాదులతో పోరాడి వాళ్ళని మట్టుబెట్టిన వీర జవాన్.

ఫాక్ట్ (నిజం): ఫోటో లో ఉన్నది భారత సైనికుడు కాదు. తన పేరు ‘Maxim Razumovsky’, రష్యన్ స్పెషల్ ఫోర్సెస్ ఆఫీసర్. కావున పోస్ట్ లో ఎటువంటి నిజం లేదు.

పోస్ట్ లోని ఫోటోని యాన్డెక్స్ లో రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా, ఆ ఫోటోతో కూడిన కొన్ని రష్యాన్ వెబ్ సైట్ లింక్స్ సెర్చ్ రిజల్ట్స్ లో వస్తాయి. సెర్చ్ రిజల్ట్స్ లోని ఒక ఆర్టికల్ ప్రకారం ఆ ఫోటో 2004 లో బెల్సన్ (రష్యా) స్కూల్ పై ఉగ్రవాది దాడి జరిగినప్పుడు తీసినది. అలానే ఈ సైనికుడి గురించి చెప్తూ ఒకతను ట్వీట్ చేసాడు. దాని ప్రకారం ఫోటో లో ఉన్నది ‘Maxim Razumovsky’, తను రష్యన్ స్పెషల్ ఫోర్సెస్ ఆఫీసర్. 2004 లో దాడి జరిగినప్పుడు తను గాయపడ్డా కూడా స్కూల్ పిల్లలను కాపాడడానికి తిరిగి వచ్చాడు. కావున పోస్ట్ లో ఉన్నది భారత సైనికుడు కాదు.

చివరగా, ఫోటో లో ఉన్నది భారత సైనికుడు కాదు, రష్యా కి చెందిన స్పెషల్ ఫోర్సెస్ ఆఫీసర్.

Share.

About Author

Comments are closed.

scroll