Fake News, Telugu
 

ఫోటోలో పాకిస్తాన్ ఆర్మీ తెల్ల జెండా పట్టుకొని వచ్చింది ఉగ్రవాదుల శవాలను తీసుకొని వెళ్ళడానికి కాదు

0

పాకిస్తాన్ ఆర్మీ ని తమ సైనికుల/ఉగ్రవాదుల శవాలను తీసుకుపోవడానికి తెల్ల జెండా తో రావొచ్చని భారత ఆర్మీ చెప్పిన తర్వాత, తమ ఉగ్రవాదుల శవాలను తీసుకొని వెళ్ళడానికి తెల్ల జెండాతో వస్తున్న పాకిస్తాన్ సైనికులు అంటూ ఒక ఫోటో తో కూడిన పోస్ట్ ని సోషల్ మీడియాలో చాలా మంది షేర్ చేస్తున్నారు. ఆ పోస్ట్ లో ఎంతవరకు నిజముందో విశ్లేషిద్ధాం.

ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్ (దావా): పాక్ ప్రేరేపిత ఉగ్రవాదుల శవాలను తీసుకెళ్ళడానికి తెల్ల జెండా చూపుతూ వచ్చిన పాక్ సైనికులు.

ఫాక్ట్ (నిజం): పోస్ట్ లో ఉన్నది పాత ఫోటో. పాక్ ఆర్మీ తెల్ల జెండా తో వచ్చిన మాట వాస్తవమే కానీ వచ్చింది సైనికులు/ఉగ్రవాదుల శవాలను తీసుకొని వెళ్ళడానికి కాదు, గత నెల నదిలో భారత దేశానికి కొట్టుకు వచ్చిన పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ కి చెందిన ఒక పిల్లవాడి మృతిదేహం కోసం. కావున పోస్ట్ లో ఇప్పుడు ఉగ్రవాదుల శవాల కోసం పాక్ ఆర్మీ తెల్ల జెండా పట్టుకొని వస్తున్నారు అని చెప్తూ ప్రజలను తప్పుదోవపట్టిస్తున్నారు.      

పోస్ట్ లోని ఫోటోని గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ లో వెతకగా, అదే ఫోటోని గత నెలలోనే ఒక జర్నలిస్ట్ తన ట్విట్టర్ అకౌంట్ లో పోస్ట్ చేసినట్టు చూడవచ్చు. పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ కి చెందిన ఏడేళ్ళ అబిద్ షేక్ అనే అబ్బాయి కిషన్ గంగ నది లో పడి చనిపోగా, తన మృతిదేహం నదిలో భారతదేశంలోకి వచ్చింది, ఆ మృతిదేహం కోసం పాకిస్తాన్ ఆర్మీ తెల్ల జెండాతో వచ్చిందని ఆ ట్వీట్ ద్వారా తెలుస్తుంది. ఈ సంఘటన మీద మరింత సమాచారం కోసం ఇండియా టుడే ఆర్టికల్ చూడవచ్చు.

చివరగా, ఫోటోలో పాకిస్తాన్ ఆర్మీ తెల్ల జెండా పట్టుకొని వచ్చింది ఉగ్రవాదుల శవాలను తీసుకొని వెళ్ళడానికి కాదు.

ఏది ఫేక్, ఏది నిజం సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?

Share.

About Author

Comments are closed.

scroll