Fake News, Telugu
 

ప్రధానమంత్రికి రాసిన ఉత్తరంలో తన సంతకం ఫోర్జరీ చేసారని మణిరత్నం అనలేదు

0

దేశంలో ముస్లింలు, దళితులు మరియు ఇతర మైనారిటీల మీద జరుగుతున్న దాడులకు నిరసనగా ప్రధానమంత్రికి 40కి పైగా ఆర్టిస్టులు మరియు మేధావులు రాసిన లేఖలో తను లేనని, తన సంతకాన్ని ఫోర్జరీ చేసారని సినిమా దర్శకుడు మణిరత్నం అన్నారని చెప్తూ ఉన్న పోస్ట్ ని ఫేస్బుక్ లో చాలా మంది షేర్ చేస్తున్నారు. ఆ పోస్ట్ లో ఎంతవరకు నిజముందో విశ్లేషిద్ధాం.

ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్ (దావా): మణిరత్నం: “‘జై శ్రీరామ్’ నినాదం పేరు పై జరుగుతున్న దాడులను వ్యతిరేకిస్తూ ప్రధానమంత్రికి రాసిన లేఖలో నేను లేను. నా సంతకాన్ని ఫోర్జరీ చేసారు”.

ఫాక్ట్ (నిజం): తన సంతకం ఫోర్జరీ చేసారని మణిరత్నం చెప్పినట్టు వస్తున్న వార్తల్లో నిజం లేదని సుహాసిని మణిరత్నం (మణిరత్నం భార్య) తన ట్విట్టర్ అకౌంటు ద్వారా తెలిపారు. కావున పోస్ట్ లో చెప్పింది అబద్ధం.      

పోస్ట్ లోని విషయం గురించి గూగుల్ లో వెతకగా, ఫేస్బుక్ పోస్టులే కాదు కొన్ని వార్తా వెబ్ సైటులు (News18 (ఆర్కైవ్డ్ వెర్షన్),  Swarajyamag (ఆర్కైవ్డ్ వెర్షన్),  Janamtv (ఆర్కైవ్డ్ వెర్షన్))  కూడా ఇదే వార్తను ప్రచురించినట్టుగా చూడవచ్చు.

ఈ విషయం మీద మరింత సమాచారం కోసం వెతకగా, సుహాసిని మణిరత్నం (మణిరత్నం సతీమణి) ఈ విషయంపై తన ట్విట్టర్ అకౌంటు ద్వారా స్పందించినట్టు తెలుస్తుంది. ఒక ట్వీట్ పై కామెంట్ చేస్తూ మణిరత్నం సంతకం ఫోర్జరీ జరిగినట్టు వస్తున్న వార్తల్లో నిజం లేదని తను తెలిపింది.

అంతేకాదు, వివిధ వార్తా పత్రికలకు చెందిన వారు మణిరత్నం ఆఫీసు వారిని సంప్రదించగా, మణిరత్నం ఉత్తరం పై సంతకం చేసారాని వారు తెలిపారు.

చివరగా, ప్రధానమంత్రికి రాసిన ఉత్తరంలో తన సంతకం ఫోర్జరీ చేసారని మణిరత్నం అనలేదు. మణిరత్నం ఉత్తరంలో సంతకం చేసారు.

ఏది ఫేక్, ఏది నిజం సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?

Share.

About Author

Comments are closed.

scroll