Fake News, Telugu
 

ప్రకాష్ రాజ్ చర్చికే కాదు, ఇతర మతాల ప్రార్థన స్థలాలకి కూడా వెళ్ళాడు

0

నాస్తికుడినని చెప్పుకొనే ప్రకాష్ రాజ్ ఇప్పుడు మాత్రం చర్చి లో ప్రార్థన చేస్తున్నాడు అంటూ ఒక ఫోటోతో కూడిన పోస్ట్ ని ఫేస్బుక్ లో చాలా మంది షేర్ చేస్తున్నారు. ఆ పోస్ట్ లో ఎంతవరకు నిజముందో విశ్లేషిద్ధాం.

ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్ (దావా): హిందువులను విమర్శించే ప్రకాష్ రాజ్ ఇప్పుడు చర్చిలో ప్రార్థనలో మునిగిపోయాడు.

ఫాక్ట్ (నిజం): ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రజల దగ్గరకు వెళ్ళే ముందు అన్ని మతాల ప్రార్థన స్థలాలకు ప్రకాష్ రాజ్ వెళ్ళాడు. దేవాలయానికి కూడా ప్రకాష్ రాజ్ వెళ్ళాడు. కానీ పోస్ట్ లో కేవలం చర్చి ఫోటో పెట్టి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు.

పోస్ట్ లోని ఫోటోని గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ లో వెతకగా, ప్రకాష్ రాజ్ చర్చికి వెళ్ళినట్టుగా Feb 5, 2019 న ఒకతను ఇదే ఫోటోతో ఒక ట్వీట్ చేసినట్టుగా ఉంటుంది. కాబట్టి ట్విట్టర్ అడ్వాన్స్డ్ సెర్చ్ సహాయంతో ప్రకాష్ రాజ్ అధికారిక అకౌంట్ లో Feb 1, 2019 నుండి Feb 10, 2019 వరకు పోస్టులు వెతకగా, పోస్ట్ లోని ఫోటోని తనే Feb 4, 2019 న ట్వీట్ చేసినట్టుగా తెలుస్తుంది. కానీ తను కేవలం చర్చి ఫోటోని ట్వీట్ చేయలేదు, దాంతో పాటు తను ఇతర మతాల ప్రార్థన స్థలాలకు వెళ్ళిన ఫోటోలను కూడా ట్వీట్ చేసాడు. ఎన్నికల ప్రచారంలో ప్రజల దగ్గరకు వెళ్ళే ముందు అన్ని మతాలను గౌరవిస్తూ వివిధ ప్రార్థన స్థలాలను దర్శించుకున్నట్టుగా తను ట్వీట్ లో రాసాడు. కానీ పోస్ట్ లో కేవలం చర్చికి వెళ్ళిన ఫోటో పెట్టి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు.

చివరగా, ప్రకాష్ రాజ్ చర్చికే కాదు ఇతర మతాల ప్రార్థన స్థలాలకు కూడా వెళ్ళాడు.

ప్రతి వారం, మేము ‘ఏది ఫేక్, ఏది నిజం’ అనే తెలుగు యూట్యూబ్ షో చేస్తున్నాం. మీరు చూసారా?

Share.

About Author

Comments are closed.

scroll