Fake News, Telugu
 

పోస్ట్ లోని వాఖ్యలు మౌలానా సయ్యద్ అహ్మద్ బుఖారి చేయలేదు. అది ఒక ఫేక్ పోస్ట్.

0

ఢిల్లీ లోని జామా మస్జిద్ షాహీ ఇమాం మౌలానా సయ్యద్ అహ్మద్ బుఖారి హిందువులను హెచ్చరిస్తూ కొన్ని వాఖ్యలు చేసాడంటూ ఒక పోస్ట్ ని ఫేస్బుక్ లో చాలా మంది షేర్ చేస్తున్నారు. ఆ పోస్ట్ లో ఎంతవరకు నిజముందో విశ్లేషిద్ధాం.

ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్ (దావా): మౌలానా సయ్యద్ అహ్మద్ బుఖారి ముస్లిం మెజారిటీ ఉన్న రాష్టల నుండి హిందువులను వెళ్ళిపోమని హెచ్చరించాడు.    

ఫాక్ట్ (నిజం): మౌలానా అన్నట్టుగా పోస్ట్ లో ఉన్న వాఖ్యలు అసలు తను చేయలేదు. ఈ విషయం పై స్పందిస్తూ తన పేరుతో షేర్ అవుతున్న పోస్ట్ లో నిజం లేదని తెలిపాడు. కావున పోస్ట్ లో చెప్పింది అబద్ధం.   

పోస్ట్ లో ఉన్న వాఖ్యలను గూగుల్ లో వెతకగా, ఆ వాఖ్యలు అసలు మౌలానా సయ్యద్ అహ్మద్ బుఖారి చేయలేదని తెలుస్తుంది. అలానే సెర్చ్ రిజల్ట్స్ లో ఈ విషయం పై ‘The Siasat Daily’ 2018 లో ప్రచురించిన ఆర్టికల్ ఒకటి దొరుకుతుంది. ఆ ఆర్టికల్ ప్రకారం వైరల్ అవుతున్న పోస్ట్ పై స్పందిస్తూ, మౌలానా సయ్యద్ అహ్మద్ బుఖారి తన పేరు తో ప్రచారం లో ఉన్న పోస్టుల్లో నిజం లేదని తెలిపాడు. శాంతియుతంగా జీవిస్తున్న ప్రజల్లో ద్వేషం నింపడానికి చేసిన ప్రయత్నం ఇది అని తను మీడియా తో అన్నాడు. కావున పోస్ట్ లో తను అన్నట్టుగా ఉన్న వాఖ్యలు తను అనలేదు.

చివరగా, పోస్ట్ లోని వాఖ్యలు మౌలానా సయ్యద్ అహ్మద్ బుఖారి చేయలేదు. అది ఒక ఫేక్ పోస్ట్.

ప్రతి వారం, మేము ‘ఏది ఫేక్, ఏది నిజం’ అనే తెలుగు యూట్యూబ్ షో చేస్తున్నాం. మీరు చూసారా?

Share.

About Author

Comments are closed.

scroll