“తమిళనాడు లోని ఒక రాజకీయనాయకుని గోడౌన్ లో జరిగిన అగ్నిప్రమాదంలో కాలి బూడిదైపోగా మిగిలిన టన్నులకొద్దీ కరన్సీనోట్లు చూడండి. ఈ డబ్బుకు లెక్కలుండవా” అంటూ ఫేస్బుక్ లో పెట్టిన వీడియో చాలా షేర్ అవుతుంది. అస్సలు ఆ పోస్ట్ లో ఎంత నిజం ఉందో విశ్లేషిద్దాం.
ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.
క్లెయిమ్ (దావా): తమిళనాడు లోని ఒక రాజకీయనాయకుని గోడౌన్ లో జరిగిన అగ్నిప్రమాదంలో కాలి బూడిదైపోగా మిగిలిన టన్నులకొద్దీ కరన్సీనోట్లు.
ఫాక్ట్ (నిజం): పోస్ట్ లో చెప్పినట్టు తమిళనాడు లోని ఒక రాజకీయనాయకుని గోడౌన్ లో జరిగిన అగ్నిప్రమాదంలో కాలి బూడిదైపోగా మిగిలిన టన్నులకొద్దీ కరన్సీనోట్లకి సంబంధించిన వీడియో కాదు. మాడ్రిడ్ కి చెందిన అలెజాంరో మాంగే అనే ఒక ఆర్టిస్ట్ చేసిన ఆర్ట్ వర్క్.
Invid టూల్ సహాయం తో పోస్ట్ లో పెట్టిన వీడియో ని ఇమేజ్ గా విభజించి రివర్స్ సెర్చ్ చేయగా పోస్ట్ పెట్టిన వీడియోలు చాలా వస్తాయి. అందులో ఒక వీడియో లో ఇదే సంఘటన యూరప్ లో జరిగినట్టు పెడ్తారు. ఆ వీడియో కామెంట్స్ లో అస్సలు ఈ సంఘటనకి సంబంధించిన అస్సలు లింక్ ఒకతను ఇస్తాడు. ఇది అలెజాంరో మాంగే అనే ఒక ఆర్టిస్ట్ చేసిన ఆర్ట్ వర్క్. తన వీడియో కి సంబంధించి పాకిస్తాన్, రష్యా , జపాన్ లో పోస్ట్ చేసిన ఫేక్ పోస్టులని కూడా అతను తన ఇంస్టాగ్రామ్ అకౌంట్ లో పెట్టాడు. తను ఈ ఆర్ట్ వర్క్ ఒక సంవత్సరం కింద చేసాడు
చివరగా, ఇది పోస్ట్ లో చెప్పినట్టు తమిళనాడు లోని ఒక రాజకీయనాయకుని గోడౌన్ లో జరిగిన అగ్నిప్రమాదంలో కాలి బూడిదైపోగా మిగిలిన టన్నులకొద్దీ కరన్సీనోట్లకి సంబంధించిన వీడియో కాదు. మాడ్రిడ్ కి చెందిన అలెజాంరో మాంగే అనే ఒక ఆర్టిస్ట్ చేసిన ఆర్ట్ వర్క్.