Fake News, Telugu
 

అరిస్తే సీయం అవ్వరని చెప్పడానికి పవన్ “సీయం..సీయం..” అని అరవమని అన్నాడు.

0

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తన సభకి వచ్చిన ప్రజలను ‘సీయం..సీయం..’ అని అరవమని అడుక్కుంటున్నాడు అంటూ ఒక వీడియో ని ఫేస్బుక్ లో చాలా మంది షేర్ చేస్తున్నారు. ఆ వీడియోలో ఎంతవరకు నిజముందో విశ్లేషిద్ధాం.

ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్ (దావా): తన సభ లో ‘సీయం..సీయం’ అని అరవమని అడుక్కుంటున్న పవన్ కళ్యాణ్

ఫాక్ట్ (నిజం): ఆ సభ మొత్తం వీడియో చూస్తే ‘సీయం..సీయం..’ అని అరవమని వ్యంగ్యంగా పవన్ అంటాడు. ఊరికే అరిస్తే సీయం ఎవరు అవ్వలేరని ఓటు నమోదు చేసుకోండని అరుపుల తరువాత అంటాడు. కావున వీడియోలో కొంచమే చూపెట్టి తప్పుదోవ పట్టిస్తున్నారు.

పోస్ట్ చేసిన వీడియో సరిగ్గా గమనిస్తే పవన్ కళ్యాణ్ వెనకాల వ్యక్తులు ఆర్మీ వాళ్లు ధరించే లాంటి షర్ట్స్ వేసుకొని కనిపిస్తారు. జనసేన లీడర్స్ కవాతులు నిర్వహించినప్పుడు అలాంటి షర్ట్స్ వేసుకుంటారు. కాబట్టి వివిధ కవాతుల వీడియోలు చూసినప్పుడు పోస్ట్ చేసిన వీడియో రాజమండ్రి కవాతుదని తెలుస్తుంది. యుట్యూబ్ లో ‘Pawan Kalyan Full Speech Rajamundry Kavathu’ అని వెతికితే ఫేస్బుక్ లో పోస్ట్ చేసిన వీడియో యొక్క ఫుల్ వెర్షన్ వస్తుంది. ఆ వీడియో లో “1:38:10” సమయం దగ్గర చూస్తే ఫేస్బుక్ లో షేర్ అవుతున్న భాగం వస్తుంది. దానికి ముందే కొన్ని సార్లు అక్కడ ఉన్న ప్రజలు “సీయం..సీయం..” అని అరిచినట్టుగా చూడవచ్చు. పైన ఇచ్చిన సమయంలో పవన్ కళ్యాణ్ నిజంగానే “సీయం..సీయం..” అని అరవమని అక్కడ ఉన్న ప్రజలను అడుగుతాడు కానీ వాళ్ళు అరిచాక “మీరు సీయం..సీయం.. అని అరిస్తే సీయం అయిపోను, సీయం అవ్వడం అంత సులువు కాదు. ఓటు లేని వాళ్ళంతా ఓటు హక్కు కోసం నమోదు చేసుకోండి” అని అంటాడు. ఇదంతా చెప్పడానికి అలా అరవమని అడిగాడు. పోస్ట్ లో కొంత భాగమే పెట్టి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు.

చివరగా, అరిస్తే సీయం అవ్వరని చెప్పడానికి పవన్ అరవమని అన్నాడు. వీడియోలో కొంత భాగమే పెట్టి తప్పుదోవ పట్టిస్తున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll