“రైతులు దాడి చేస్తారని ఇంటెలిజెన్స్ సమాచారంతో రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటన రద్దు అయింది” అని పేర్కొంటూ ‘Way2News’ కథనం ప్రచురించట్లు న్యూస్ క్లిప్ ఫోటో ఒకటి సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతోంది (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ, & ఇక్కడ). ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.
క్లెయిమ్: “రైతులు దాడి చేస్తారని ఇంటెలిజెన్స్ సమాచారంతో రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటన రద్దు” అని ‘Way2News’ వార్తా కథనం ప్రచురించింది.
ఫాక్ట్(నిజం): ఈ వార్తను ‘Way2News’ ప్రచురించలేదు. ఇది వారి లోగోను వాడి తప్పుడు కథనంతో ఎడిట్ చేస్తూ షేర్ చేసిన ఫోటో అని ‘Way2News’ సంస్థ 12 ఫిబ్రవరి 2025న X(ట్విట్టర్) పోస్టు ద్వారా స్పష్టం చేసింది. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.
వైరల్ పోస్టులో పేర్కొన్నట్లుగా రైతులు దాడి చేస్తారని ఇంటెలిజెన్స్ సమాచారంతో రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటన రద్దయిందా? అని తగిన కీవర్డ్స్ ఉపయోగిస్తూ ఇంటర్నెట్‌లో వెతకగా, వైరల్ క్లెయింను సమర్థించే ఎటువంటి విశ్వసనీయమైన రిపోర్ట్స్ మాకు లభించలేదు.
ఈ క్రమంలోనే రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటన రద్దయింది పేర్కొంటూ పలు మీడియా సంస్థలు ప్రచురించిన వార్తా కథనాలు లభించాయి (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ, & ఇక్కడ). ఈ కథనాల ప్రకారం, ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం, 11 ఫిబ్రవరి 2025న సాయంత్రం రాహుల్ గాంధీ తెలంగాణలోని వరంగల్ జిల్లాలో పర్యటించాల్సి ఉండగా, చివరి నిమిషంలో ఆయన వరంగల్ పర్యటన రద్దు అయింది. ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా 11 ఫిబ్రవరి 2025న లోక్‌సభలో పలు కీలక బిల్లులపై చర్చలో రాహుల్ గాంధీ పాల్గొనాల్సి ఉన్నందున, రాహుల్ గాంధీ పర్యటన రద్దు అయినట్లు కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయని ఈ కథనాలు పేర్కొన్నాయి. ఈ కథనాలు ఏవీ కూడా రైతులు దాడి చేస్తారని ఇంటెలిజెన్స్ సమాచారంతో రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటన రద్దు చేయబడినట్లు ఎక్కడా పేర్కొనలేదు.
పైగా, ఈ వార్తను Way2News సంస్థ కూడా ప్రచురించలేదు అని తెలిసింది. ఈ వైరల్ ‘Way2News’ వార్త కథనం పైన ఉన్న ఆర్టికల్ లింక్ (https://way2.co/350brl) ద్వారా ‘Way2News’ ఫాక్ట్-చెక్ వెబ్‌సైట్‌లో వెతకగా, ఈ ఐడీతో ఉన్న ఎటువంటి కథనం ‘Way2News’ వెబ్‌సైట్‌లో లభించలేదు.
అంతేకాకుండా, ఈ న్యూస్ క్లిప్ వైరల్ అవడంతో, 12 ఫిబ్రవరి 2025న ‘Way2News’ సంస్థ X(ట్విట్టర్) పోస్ట్ (ఆర్కైవ్డ్) ద్వారా స్పందిస్తూ,“ఇది Way2News ప్రచురించిన కథనం కాదు, కొందరు మా ఫార్మాట్‌లో తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నారు” అంటూ ఈ వార్త కథనం ఫేక్ అని స్పష్టత ఇచ్చింది.
గతంలో కూడా ‘Way2News’ పేరుతో పలు ఫేక్ వార్తలు వైరల్ కాగా, అవి ఫేక్ అని, అలాగే వాటిని ‘Way2News’ కూడా ప్రచురించలేదు అని చెబుతూ Factly రాసిన ఫాక్ట్-చెక్ కథనాలను ఇక్కడ, ఇక్కడ, & ఇక్కడ చూడవచ్చు.
చివరగా, రైతులు దాడి చేస్తారని ఇంటెలిజెన్స్ సమాచారంతో రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటన చేయబడిందని పేర్కొంటూ ‘Way2News’ వార్తా కథనం ప్రచురించలేదు.