ఈ సైకిల్ శిల్పం ఇండోనేషియాలో ఉంది, తమిళనాడు లోని పంచవర్ణ స్వామి దేవాలయంలో కాదు

7వ శతాబ్దంలో (1300 ఏళ్ళ క్రితం) తమిళనాడులో నిర్మించిన పంచవర్ణ స్వామి దేవాలయంలో సైకిల్ తొక్కుతున్న భారతీయుని శిల్పం’, అని చెప్తూ ఒక శిల్పం ఫోటోని సోషల్ మీడియాలో చాలా మంది షేర్ చేస్తున్నారు. ఆ పోస్ట్ లో ఎంతవరకు నిజముందో చూద్దాం.

ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: 1300 ఏళ్ళ క్రితం తమిళనాడులో నిర్మించిన పంచవర్ణ స్వామి దేవాలయంలో సైకిల్ తొక్కుతున్న భారతీయుని శిల్పం.

ఫాక్ట్: ఫోటోలో ఉన్న శిల్పం అసలు భారతదేశంలో లేదు. ఇండోనేషియా లోని బాలి లో ఉన్న ‘Pura Dalem Jagaraga Temple’ లో ఆ సైకిల్ శిల్పం ఉంది. అంతేకాదు, 19 శతాబ్దంలో డచ్ వారితో యుద్ధం జరిగాక ఆ శిల్పాన్ని (ఇతర ఆధునిక పరికరాల శిల్పాలతో పాటు) మందిరం గోడల పై చెక్కినట్టు తెలిసింది. కావున పోస్ట్ లో చెప్పింది తప్పు.

పోస్ట్ లోని ఫోటోని గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ లో వెతకగా, అదే ఫోటో ‘Tripadvisor’ వెబ్సైటులో దొరుకుంతుంది. ఆ ఫోటో ఇండోనేషియా లోని బాలి లో ఉన్న ‘Pura Dalem Jagaraga Temple’ కి సంబంధించింది అని ఆ వెబ్సైటులో రాసి ఉంటుంది.

ఆ మందిరం పేరుతో ఇంటర్నెట్ లో వెతకగా, ఆ సైకిల్ తొక్కుతున్న శిల్పం కి సంబంధించి చాలా ఫోటోలు సెర్చ్ రిజల్ట్స్ లో వస్తాయి. వాటిని ఇక్కడ, ఇక్కడ, మరియు ఇక్కడ చూడవొచ్చు. ఆ మందిరానికి సంబంధించిన ఒక వీడియోలో కూడా సైకిల్ శిల్పం చూడవొచ్చు.

అంతేకాదు, 19 శతాబ్దంలో డచ్ వారితో యుద్ధం జరిగాక ఆ శిల్పాన్ని (ఇతర ఆధునిక పరికరాల శిల్పాలతో పాటు) మందిరం గోడల పై చెక్కినట్టు తెలిసింది. ఆ మందిరం గోడలపై ఉన్న శిల్పాల గురించి మరింత సమాచారం కోసం ఇక్కడ చదవొచ్చు.

ఇంతకముందు, పంచవర్ణ స్వామి దేవాలయం గురించి చెప్తూ, వేరే ఫోటోలు వైరల్ అయినప్పుడు FACTLY రాసిన ఫ్యాక్ట్-చెక్ ఆర్టికల్ ని ఇక్కడ చదవొచ్చు.

చివరగా, ఇండోనేషియా కి సంబంధించిన శిల్పం ఫోటోని పెట్టి, తమిళనాడు లోని పంచవర్ణ స్వామి దేవాలయంలో 1300 ఏళ్ళ క్రితం నిర్మించిన శిల్పం అని తప్పుగా షేర్ చేస్తున్నారు.