రాజ్యసభ ఎంపీ సంజయ్ రౌత్ సీనియర్ సిటిజన్ల గురించి ప్రసంగిస్తూ, ‘65 ఏళ్లు పైబడిన సీనియర్ సిటిజన్లను ప్రభుత్వం పట్టించుకోనందున వారిని చంపండి’ అని మాట్లాడుతూ వారి సంక్షేమం కోసం కొన్ని ప్రత్యేకాధికారాలను డిమాండ్ చేశారు అంటూ సోషల్ మీడియాలో (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ) షేర్ చేస్తున్నారు. దీని వెనుక ఉన్న నిజమెంటో ఈ కథనం ద్వారా తెలుసుకుందాం.

క్లెయిమ్: రాజ్యసభ ఎంపీ సంజయ్ రౌత్ సీనియర్ సిటిజన్ల గురించి ప్రసంగిస్తూ, ‘65 ఏళ్లు పైబడిన సీనియర్ సిటిజన్లను ప్రభుత్వం పట్టించుకోనందున వారిని చంపండి’ అని మాట్లాడుతూ వారి సంక్షేమం కోసం కొన్ని ప్రత్యేకాధికారాలను ఆయన డిమాండ్ చేశారు.
ఫాక్ట్(నిజం): సంజయ్ రౌత్ ‘65 ఏళ్లు పైబడిన సీనియర్ సిటిజన్లను ప్రభుత్వం పట్టించుకోనందున వారిని చంపండి’ అని అన్నట్టు ఎక్కడా ఆధారాలు లేవు. కాబట్టి, ఈ పోస్టు ఫేక్.
ఈ క్లెయిమ్ గురించి తగిన కీ వర్డ్స్ ఉపయోగిస్తూ ఇంటర్నెట్లో వెతికితే, రౌత్ ఈ వ్యాఖ్యలు చేసినట్టు ఎటువంటి ఆధారాలు మాకు లభించలేదు. అయితే, 2021లో రౌత్ ప్రస్తుత సంక్షేమ పథకాల గురించి పార్లమెంటులో వ్రాతపూర్వకంగా అడిగారు. దానికి ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాల వివరాలతో (బడ్జెట్‌లు/ప్రాజెక్టులతో సహా) సమాధానమిచ్చింది. ఈ వ్రాతపూర్వక ప్రశ్నలో ఎటువంటి పాలసీ మార్పులను ఆయన ప్రతిపాదించలేదు.
ఇదివరకు ఇదే వాదనతో జయ బచ్చన్ ఈ వ్యాఖ్యలు చేశారంటూ సోషల్ మీడియాలో తప్పుగా షేర్ చేసారు. దాని గురించి ఫ్యాక్ట్లీ రాసిన కథనాన్ని కింద చూడవచ్చు.
చివరిగా, ‘65 ఏళ్లు పైబడిన సీనియర్ సిటిజన్లను ప్రభుత్వం పట్టించుకోనందున వారిని చంపండి’ అని సంజయ్ రౌత్ రాజ్యసభలో అనలేదు.