పాత వీడియో పెట్టి, ‘చైనా మీద ప్రతీకార దాడులు మొదలు పెట్టిన ఇండియన్ ఆర్మీ’ అని షేర్ చేస్తున్నారు

గల్వాన్ వ్యాలీ (లడఖ్) ఘటనకి ప్రతీకారంగా చైనా మీద ఇండియన్ ఆర్మీ దాడులు ఆరంభించింది అంటూ ఒక వీడియోని  సోషల్ మీడియాలో చాలా మంది షేర్ చేస్తున్నారు. పోస్ట్ లోని వీడియో 2019 లో మహారాష్ట్రలో నిర్వహించిన ఫైరింగ్ డ్రిల్ కి సంబంధించిన వీడియోగా FACTLY గుర్తించడం జరిగింది. ‘Economic Times’ వారు తమ వెబ్సైట్ లో ‘Watch: Indian Army’s Grad artillery firing at Deolali Firing range’ అనే టైటిల్ తో అదే వీడియోని 2019 లోనే ప్రచురించినట్టు చూడవచ్చు. ఆ వీడియోని ‘Zee News’ ఛానల్ వారు కూడా తమ అధికారిక ఇన్స్తగ్రం అకౌంట్లో పోస్ట్ చేసి అదే విషయాన్ని తెలిపింది. అంతేకాదు, గత సంవత్సరం అదే వీడియోని ‘పాక్ పై భారత్ ఆర్మీ చేసిన దాడి’ అంటూ కొందరు షేర్ చేసినప్పుడు, అది తప్పు అని చెప్తూ FACTLY  రాసిన ఫ్యాక్ట్-చెక్ ఆర్టికల్ ఇక్కడ చదవొచ్చు.

సోర్సెస్:
క్లెయిమ్ – ఫేస్బుక్ పోస్ట్ (ఆర్కైవ్డ్)
ఫాక్ట్ 
1. ‘EconomicTimes’ ఆర్టికల్: https://economictimes.indiatimes.com/news/defence/watch-indian-armys-bm-21-grad-artillery-firing-at-deolali-firing-range/videoshow/69989854.cms
2. ‘Zee news’ పోస్ట్: https://www.instagram.com/p/BzS3CwMFFKX/

Did you watch our new video?