ఫేక్ లేబర్ ఇన్సూరెన్స్ స్కీం వివరాలతో కూడిన పాత మెసేజ్ ని మళ్ళీ షేర్ చేస్తున్నారు

లేబర్ ఇన్సూరెన్స్ వివరాలు అంటూ ఒక పోస్ట్ ని ఫేస్బుక్ లో చాలా మంది షేర్ చేస్తున్నారు. అయితే, అదే మెసేజ్ ని గత సంవత్సరం కొందరు షేర్ చేసినప్పుడు, అది తప్పుడు మెసేజ్ అని చెప్తూ FACTLY ఫ్యాక్ట్-చెక్ ఆర్టికల్ ని జూన్ 2019 లోనే రాసింది. అదే మెసేజ్ ఇప్పుడు మళ్ళీ వైరల్ అవుతుంది. పోస్ట్ లో చెప్పిన వివరాలతో కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ వెబ్ సైట్ లో ఎటువంటి స్కీం దొరకలేదు. వేరే స్కీములు (ప్రధాన మంత్రి శ్రమ యోగి మందన్, ప్రధాన మంత్రి సురక్ష బీమా యోజన మరియు ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి బీమా జ్యోతి యోజన) ఉన్నాయి , కానీ పోస్ట్ లో ఇచ్చిన దానికి వాటికీ పోలిక ఉండదు. పూర్తి ఫ్యాక్ట్-చెక్ ఆర్టికల్ ని ఇక్కడ చదవొచ్చు.

సోర్సెస్:
క్లెయిమ్ – ఫేస్బుక్ పోస్ట్ (ఆర్కైవ్డ్)
ఫాక్ట్ 
1. ‘Ministry of Labour and Employment’ వెబ్ సైట్  – https://labour.gov.in/schemes/aam-admi-beema-yojana
2. FACTLY పాత ఫ్యాక్ట్-చెక్ ఆర్టికల్ – పోస్ట్ లో ఇచ్చిన వివరాలతో ఎటువంటి లేబర్ ఇన్సూరెన్స్ స్కీం లేదు

Did you watch our new video?