Fake News, Telugu
 

పోస్ట్ లో ఇచ్చిన వివరాలతో ఎటువంటి లేబర్ ఇన్సూరెన్స్ స్కీం లేదు.

0

లేబర్ ఇన్సూరెన్స్ వివరాలు అంటూ ఒక పోస్ట్ ని ఫేస్బుక్ లో చాలా మంది షేర్ చేస్తున్నారు. కొందరు ఆ పోస్ట్ ని శ్రమ యోగి మందన్ స్కీం ఫోటోతో పోస్ట్ చేస్తే, మరికొందరు ప్రధాన మంత్రి సురక్ష బీమా మరియు జీవన్ జ్యోతి బీమా స్కీమ్ల ఫోటోలతో పోస్ట్ చేసారు. ఆ పోస్ట్ లల్లో ఎంతవరకు నిజముందో విశ్లేషిద్ధాం.

ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్ (దావా): 18 నుండి 55 ఏళ్ళ కూలీలకు లేబర్ ఇన్సూరెన్స్ ప్రీమియం ఒక సంవత్సరానికి 22 రూపాయిలు మాత్రమే. లేబర్ ఇన్సూరెన్స్ స్కీం ద్వారా లైఫ్ ఇన్సూరెన్సూ, ఆడపిల్లలకు మ్యారేజ్ గిఫ్టు, డెలివరీ గిఫ్టు మరియు ప్రమాదంలో వికలాంగులు అవుతే పరిహారం ప్రభుత్వం ఇస్తుంది.

ఫాక్ట్ (నిజం): పోస్ట్ లో చెప్పిన వివరాలతో కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ వెబ్ సైట్ లో ఎటువంటి స్కీం దొరకదు. వేరే స్కీములు (ప్రధాన మంత్రి శ్రమ యోగి మందన్, ప్రధాన మంత్రి సురక్ష బీమా యోజన మరియు ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి బీమా జ్యోతి యోజన) ఉన్నాయి, కానీ పోస్ట్ లో ఇచ్చిన దానికి వాటికీ పోలిక ఉండదు. కావున పోస్ట్ లో చెప్పింది అబద్ధం.   

పోస్ట్ లోని ఇచిన లేబర్ ఇన్సూరెన్సు వివరాల కొరకు కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ వెబ్ సైట్ లో వెతకగా, పోస్ట్ లో ఇచ్చినట్టుగా 18 నుండి 55 ఏళ్ళ అర్హత తో ఎటువంటి స్కీం దొరకదు. వేరే చాలా స్కీమ్లు ఉంటాయి కానీ పోస్ట్ లో ఇచ్చిన వివరాలతో ఏదీ కూడా సరిపోదు. కొన్ని పోస్టుల్లో ప్రధాన మంత్రి శ్రమ యోగి మందన్ పోస్టర్ పెట్టారు కాబట్టి దానికి సంబంధించిన వివరాలు చూడగా దానితో కూడా పోస్ట్ లో ఇచ్చిన వివరాలు మ్యాచ్ అవ్వవు. మరికొన్ని పోస్టుల్లో ప్రధాన మంత్రి సురక్ష బీమా యోజన మరియు ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన ఫోటోలు పెట్టారు కానీ పోస్ట్ లోని వివరాలు ఆ స్కీమ్ల తో కూడా మ్యాచ్ అవ్వవు.

చివరగా, పోస్ట్ లో ఇచ్చిన వివరాలతో ఎటువంటి లేబర్ ఇన్సూరెన్స్ స్కీం లేదు.

ఎలక్షన్ కౌంటింగ్ ఎట్లా జరుగుతుందో మీకు తెలుసా? ఈ వీడియో చుడండి

Share.

About Author

Comments are closed.

scroll