KPHB లోని పార్క్ లో నిజంగానే ఇస్లాం కి చెందిన అక్రమ కట్టడం నిర్మించారు, స్పందించి తీసేయించిన ప్రభుత్వం

కూకట్‌పల్లి హౌసింగ్ బోర్డులోని ఒక పబ్లిక్ పార్క్ ని కబ్జా చేసి ముస్లిం మతానికి సంబంధించిన కట్టడాన్ని నిర్మించారని చెప్తూ, ఒక వీడియోతో కూడిన పోస్ట్ ని ఫేస్బుక్ లో చాలా మంది షేర్ చేస్తున్నారు. దాని గురించి చూడగా, నిజంగానే ఆ పార్క్ లో అక్రమ కట్టడమ ఉన్నట్టు FACTLY విశ్లేషణలో తేలింది. అయితే, ఆ పార్క్ లో అక్రమంగా నిర్మించిన కట్టడాన్ని తొలగించామని చెప్తూ, ఫోటోలతో సహా ట్విట్టర్ లో కూకట్‌పల్లి ప్రాంతానికి GHMC డిప్యూటీ కమీషనర్ ట్వీట్ చేసారు. ఆ ఫోటోలో ఉన్న కట్టడం మరియు వీడియోలో ఉన్న కట్టడం ఒకటేనని చూడవొచ్చు. కావున, పోస్ట్ లో చెప్పింది నిజం.

ఇంతకముందు, కూకట్‌పల్లి హౌసింగ్ బోర్డు కాలనీ లోని వేరే ప్రదేశంలో ‘హిందూ దేవాలయం పక్కన ఉన్న స్థలాన్ని ముస్లింలు కబ్జా చేసి జెండా పాతారు’ అని కొన్ని ఫోటోలు వైరల్ అయినప్పుడు, అక్కడ అలాంటిదేమీ జరగలేదని FACTLY రాసిన ఆర్టికల్ ని ఇక్కడ చూడవొచ్చు.

సోర్సెస్:
క్లెయిమ్ – ఫేస్బుక్ పోస్ట్ (ఆర్కైవ్డ్)
ఫాక్ట్ 
1. ట్వీట్ – https://twitter.com/DC_Kukatpally/status/1263766452487827456

Did you watch our new video?