ఎడిటెడ్ ఫోటో పెట్టి, ‘మాకు కాశ్మీర్ వద్దు, హైడ్రాక్సీక్లోరోక్విన్ ఇవ్వండి’ అని పాకిస్తాన్ యువత బ్యానర్ పట్టుకునట్టు షేర్ చేస్తున్నారు.

కొంతమంది యువకులు తమకు కాశ్మీర్ వద్దని, హైడ్రాక్సీక్లోరోక్విన్ ఇస్తే చాలు అని అడుగుతున్నట్టుగా ఉన్న ఫోటోని ఫేస్బుక్ లో చాలామంది షేర్ చేస్తున్నారు. కానీ, ‘FACTLY’ పరిశీలనలో ఆ ఫోటో ఫోటోషాప్ చేసినదని తెలిసింది. “We want Azaadi” అని కాశ్మీర్ ప్రజలు పట్టుకొన్న బ్యానర్ ఫోటోని తీసుకొని “We don’t want Kashmir. Give us Hydroxychloroquine” అని ఫోటోషాప్ చేసి, పాకిస్తాన్ యువకులు హైడ్రాక్సీక్లోరోక్విన్ అడుగుతున్నట్టు తప్పుగా ప్రచారం చేస్తున్నారు. ఇంతకముందు ఇలాంటి ఫోటోనే వేరే సందర్భంలో వైరల్ అయినప్పుడు, FACTLY రాసిన ఆర్టికల్ ని ఇక్కడ చదవొచ్చు.

ఇప్పటివరకు కోవిడ్-19 చికిత్సకి ఎటువంటి మందు లేదు. కానీ,  కొన్ని సందర్భాల్లో డాక్టర్లు హైడ్రాక్సీక్లోరోక్విన్ డ్రగ్ ఉపయోగించడం ద్వారా రోగులు త్వరగా కోలుకున్నట్లుగా కొన్ని ప్రాథమిక పరీక్షల్లో తేలినట్లుగా చెపుతున్నారు. దాంతో ఆ డ్రగ్ ని పెద్ద మొత్తంలో తాయారు చేసే దేశాల్లో ఒకటైన ఇండియాని వివిధ దేశాల వారు సరఫరా చేయవలసిందిగా కోరుతున్నారు. అందులో భాగంగా, పాకిస్థాన్ కూడా తమకు హైడ్రాక్సీక్లోరోక్విన్ డ్రగ్ సరఫరా చేయవలసిందిగా కోరినట్లు కొన్ని వార్తా సంస్థలు పేర్కొన్నాయి. అయితే, ఆ క్లెయిమ్ ని FACTLY సొంతంగా వెరిఫై చేయలేకపోయింది.

సోర్సెస్:
క్లెయిమ్: ఫేస్బుక్ పోస్ట్ (ఆర్కైవ్డ్)
ఫాక్ట్:
1. న్యూస్ ఆర్టికల్ – https://www.indiatoday.in/india/story/kashmir-unrest-youth-raise-pro-pakistan-slogans-burhan-wani-333919-2016-08-08

‘మీకు తెలుసా’ సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?