2022లో TMC, BJP మద్దతుదారుల మధ్య జరిగిన వాగ్వాదం యొక్క వీడియోను 2024 లోక్ సభ ఎన్నికలకు సంబంధించిందిగా షేర్ చేస్తున్నారు

కొంతమంది వ్యక్తులు BJP మద్దతుదారులపై దాడి చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కోల్‌కతాలో BJPకి ప్రచారం చేస్తున్న వ్యక్తులపై సాధారణ ప్రజలే దాడి చేశారు అంటూ ఈ వీడియో షేర్ చేయబడుతోంది. దీని వెనుక ఎంత నిజం ఉందో ఈ కథనం ద్వారా తెలుసుకుందాం.

ఆర్కైవ్ చేసిన పోస్టును ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: 2024 లోక్‌సభ ఎన్నికలకు ముందు కోల్‌కతాలో BJPకి ప్రచారం చేస్తున్న వారిపై కొందరు వ్యక్తులు దాడి చేస్తున్న వీడియో.

ఫాక్ట్(నిజం): 2022లో పశ్చిమ బెంగాల్‌లోని హుగ్లీలో TMC, BJP మద్దతుదారుల మధ్య జరిగిన వాగ్వాదానికి సంబంధించిన విజువల్స్ ఇవి. ఈ విజువల్స్‌కు 2024 లోక్‌సభ ఎన్నికలకు ఎలాంటి సంబంధం లేదు. కావున పోస్టులో చేసిన క్లెయిమ్ తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.

వైరల్ వీడియో గురించి తగిన కీ వర్డ్స్ ఉపయోగిస్తూ ఇంటర్నెట్లో వెతికితే, ఆగస్టు 2022 లో ఇదే వీడియో గురించి ప్రచురించిన వార్తా పత్రికకు దారి తీసింది. ఈ నివేదికల ప్రకారం, పశ్చిమ బెంగాల్‌లోని హుగ్లీలో TMC, BJP మద్దతుదారుల మధ్య జరిగిన వాగ్వాదాన్ని విజువల్స్ చూపిస్తున్నాయి. TMC ఎమ్మెల్యే అసిత్ మజుందార్, అతని మద్దతుదారులు BJP కార్యకర్తలు తనను వేధించారని, అతని కారును అడ్డుకోవడానికి ప్రయత్నించారని ఆరోపిస్తూ వారిపై దాడి చేశారు.

దీని గురించి మరింత వెతికితే, ఆ సమయంలోని కొన్ని ఇతర నివేదికలు, ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ కనుగొన్నాము. ఈ విజువల్స్‌కు రాబోయే 2024 లోక్‌సభ ఎన్నికలకు ఎలాంటి సంబంధం లేదని వీటి ద్వారా నిర్ధారించవచ్చు. ఇంతకుముందు, ఇదే వీడియోను వేరే క్లైములతో షేర్ చేయబడ్డప్పుడు  ఫ్యాక్ట్‌లీ ఆ వీడియోలకి సంబంధించిన ఒక ఫ్యాక్ట్-చెక్ ఆర్టికల్స్ పబ్లిష్ చేసింది (ఇక్కడ మరియు ఇక్కడ).

చివరిగా, 2022లో పశ్చిమ బెంగాల్‌లో TMC, BJP మద్దతుదారుల మధ్య జరిగిన వాగ్వాదం యొక్క వీడియోను 2024 లోక్ సభ ఎన్నికలకు సంబంధించిందిగా షేర్ చేస్తున్నారు.