హోటల్స్‌లో మూత్రం కలిపిన వంటకం తయారు చేస్తున్న దృశ్యాలని చెప్పి ఒక ప్రాంక్ వీడియోని షేర్ చేస్తున్నారు.

హొటల్స్‌లో ‘టొమాటో-ఎగ్’ కర్రీ తయారు చేస్తున్న పద్దతిని చూపిస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఒకతను కూరలో మూత్రం కలపడాన్ని మనం చూడవచ్చు. అసలు ఈ వీడియో వెనుక ఉన్న అసలు నిజం ఏంటో ఈ ఆర్టికల్ ద్వారా చూడవచ్చు. 

క్లెయిమ్: ‘టొమాటో-ఎగ్’ కర్రీని హొటల్స్‌లో మూత్రం కలిపి చేసి తయారు చేస్తున్న దృశ్యాలు. 

ఫాక్ట్(నిజం): వైరల్ అవుతున్న ఈ వీడియో ఒక ప్రాంక్ వీడియో. నిజంగా హొటల్‌లో  మూత్రం కలిపి తయారు చేసిన ‘టొమాటో-ఎగ్’ కూర దృశ్యాలు కాదు. ఒరిజినల్ ప్రాంక్ వీడియోలో అందులో కనిపిస్తున్న వ్యక్తి ఒక బాటిల్ పట్టుకొని గిన్నెలో ఒక ద్రవాన్ని పోయడాన్ని మనం చూడవచ్చు. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు

వైరల్ వీడియో గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి, అందులోని కొన్ని కీ ఫ్రేమ్స్ ఉపయోగించి రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా,‘The Shadab Word News’  అనే యూట్యూబ్ ఛానల్ ఈ వీడియో గురించి పోస్ట్ చేసిన ఒక వీడియో దొరికింది.

ఈ వైరల్ క్లెయిమ్ ఫేక్ అని చెప్తూ, క్లెయిమ్ చేస్తున్నట్టుగా అందులో ఉన్న వ్యక్తి, ఆ గిన్నెలో మూత్రం పోయడం లేదు అని, అసలు వీడియోలో ఒక బాటిల్ కనిపిస్తుంది అని, ఇది కేవలం ఒక ప్రాంక్ వీడియో అని చెప్పాడు.

ఈ వీడియో ద్వారా వైరల్ వీడియో యొక్క పూర్తి వెర్షన్ అప్లోడ్ చేసిన, ‘ashiq.billota’ అనే ఇన్‌స్టాగ్రాం పేజీ(ఇప్పుడు డిలీట్ అయిపోయింది) మాకు దొరికింది. ఇందులో ఒరిజినల్ వీడియోని డిసెంబర్ 2022లో అప్లోడ్ చేశారు

ఈ ప్రాంక్ వీడియోలో, మూత్ర విసర్జన చేస్తున్నట్లు కనిపిస్తున్న వ్యక్తి, తన పెల్విస్ భాగానికి దగ్గర ఒక బాటిల్‌ను పట్టుకుని కనిపిస్తాడు. వైరల్ పోస్ట్ ద్వారా షేర్ చేయబడిన వీడియో యొక్క పూర్తి వీడియో ఇది. దీనిలో బాటిల్ కనిపించే భాగాలు జాగ్రత్తగా ఎడిట్ చేసి, వీడియోని ఫ్లిప్ చేసి, కూర గిన్నెలో మూత్ర విసర్జన చేసి ‘టొమాటో-ఎగ్’ కర్రీని హొటల్స్‌లో తయారు చేస్తున్నారు అని తప్పుగా షేర్ చేస్తున్నారు. 

ఇదే వీడియో డిసెంబర్ 2022లో, స్వీట్ తయారు చేస్తూ, ఒక స్వీట్స్ గిన్నెలో ఒక వ్యక్తి మూత్ర విసర్జన చేస్తున్న వీడియో అని వైరల్ అయినప్పుడు మేము దాన్ని ఫాక్ట్-చెక్ చేసాము, దాన్ని ఇక్కడ చూడవచ్చు. 

చివరగా, హొటల్స్‌లో మూత్రం కలిపి కూరలు తయారు చేస్తున్న వీడియో అని చెప్పి ఒక ప్రాంక్ వీడియోని షేర్ చేస్తున్నారు.