YSRCP విజేతగా నిలుస్తుంది అని PARC సంస్థ ప్రకటించింది ఒక ఫేక్ ఎగ్జిట్ పోల్

2019 సార్వత్రిక ఎన్నికల మొదటి ఫేజ్ విజయవంతంగా పూర్తి అయిన తరువాత నుండి సోషల్ మీడియాలో కొన్ని ఎగ్జిట్ పోల్స్ ప్రచారంలో ఉన్నాయి. అందులో Political Analysis & Research Center (PARC) వారు ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో వైయస్ఆర్సీపీ పార్టీ గెలుస్తుంది అంటూ వెల్లడించిన ఎగ్జిట్ పోల్స్ ఒకటి. ఈ సర్వే వివరాలను విశ్లేషిద్దాం.

పోస్ట్ యొక్క ఆర్చివ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్ (దావా): PARC ఢిల్లీ సంస్థ చేసిన 2019 సార్వత్రిక ఎన్నికలు ఎగ్జిట్ పోల్ సర్వే

ఫాక్ట్ (నిజం): PARC ఎగ్జిట్ పోల్ రిపోర్ట్ లో ఇవ్వబడిన చిరునామా ఆధారంగా ఇంటర్నెట్లో వెతికినప్పుడు అటువంటి పేరుతో ఏ సంస్థ కూడా కనుగొనబడలేదు మరియు అందులో ఉన్న ఫోన్ నంబర్ ద్వారా సంప్రదించాలని ప్రయత్నించగా వారు స్పందించలేదు. కావున ఫేస్బుక్ లో షేర్ అవుతున్న పోస్ట్ లో ఎటువంటి నిజం లేదు

ఎగ్జిట్ పోల్స్ ప్రచురణకు సంబంధించిన నియమాలు THE REPRESENTATION OF THE PEOPLE ACT, 1951 యొక్క సెక్షన్ 126A లో పొందుపరిచారు. దీనిలో ఉన్న నిబంధనల ప్రకారంగా,  ఎన్నికల సంఘం వారు నోటిఫై చేసిన సమయంలో  ఎగ్జిట్ పోల్స్ నిర్వహించడం కానీ వాటి ఫలితాలని  బహిర్గతం చేయడం కానీ నిషిద్ధం అని తెలుస్తుంది.

భారతదేశ ఎన్నికల సంఘం (ECI ) వారు ఏప్రిల్ 8, 2019 న విడుదల చేసిన ప్రెస్ నోట్ అనుసారంగా 11.04.2019 (గురువారం) ఉదయం 7:00 గంటల నుండి 19.05.2019 (ఆదివారం) 6:30 గంటల మధ్య ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వెల్లడించడం నిషిద్ధం.

PARC ఎగ్జిట్ పోల్ రిపోర్ట్ లో ఉన్న చిరునామా ఆధారంగా గూగుల్ లో వెతికినప్పుడు అటువంటి పేరుతో ఏ సంస్థ కూడా కనుగొనబడలేదు.  అందులో ఉన్న ఫోన్ నంబర్ ద్వారా మరియు మెయిల్  ద్వారా సంప్రదించాలని ప్రయత్నించగా వారు స్పందించలేదు. కావున PARC అనే ఎగ్జిట్ పోల్స్ సంస్థ ఉండకపోవచ్చు.

చివరగా, YSRCP విజేతగా నిలుస్తుంది అని PARC సర్వే సంస్థ ప్రకటించిందంటూ చలామణిలో ఉన్నది ఒక నకిలీ నోట్.