Fake News, Telugu
 

UPA మరియు NDA ప్రభుత్వాలలో జరిగిన ఉగ్రవాద దాడులను పోలుస్తూ ఇచ్చిన సంఖ్యలలో ఎటువంటి నిజం లేదు

0

UPA ప్రభుత్వంలో కంటే NDA ప్రభుత్వంలో ఎక్కువ ఉగ్రవాద దాడులు జరిగాయని మరియు ఎక్కువ మంది సైనికులు చనిపోయారని సీ.పీ.ఐ(ఎం) లీడర్ సీతారాం ఏచూరి ప్రజాశక్తి వార్తా పత్రికలో రాసినట్టు ఉన్న ఒక పోస్ట్ ని ఫేస్బుక్ లో చాలా మంది షేర్ చేస్తున్నారు. ఆ పోస్ట్ లో ఎంతవరకు నిజముందో విశ్లేషిద్ధాం.

ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్ (దావా) 1: UPA (2009-14) మరియు NDA (2014-19) ప్రభుత్వాలలో 109 మరియు 626 ఉగ్రవాద దాడులు జరిగాయి.

ఫాక్ట్ (నిజం): UPA (2009-14) మరియు NDA (2014-19) ప్రభుత్వాలలో ఉగ్రవాదానికి సంభందించి 1763 మరియు 1219 సంఘటనలు జరిగాయి. కావున పోస్ట్ లో చెప్పింది అబద్ధం.

కేంద్ర హోం శాఖ వారు రిలీజ్ చేసిన 2013-14 వార్షిక రిపోర్ట్ ప్రకారం, UPA ప్రభుత్వ హయంలో (2009 నుండి 2014 వరకు) ఉగ్రవాదానికి సంభందించి 1763 సంఘటనలు జరిగాయి. అదే NDA ప్రభుత్వంలో (2014 నుండి 2018 వరకు) ఉగ్రవాదానికి సంభందించి 1672 సంఘటనలు జరిగాయి. కావున ఉగ్రవాదానికి సంభందించి జరిగిన ఘటనల సంఖ్య పోస్ట్ లో తప్పుగా ఇచ్చారు.

సోర్స్: కేంద్ర హోం శాఖ 2013-14 రిపోర్టు

క్లెయిమ్ (దావా) 2: UPA (2009-14) మరియు NDA (2014-19) ప్రభుత్వాలలో 139 మరియు 483 మంది సైనికులు చనిపోయారు.

ఫాక్ట్ (నిజం): UPA (2009-14) మరియు NDA (2014-19) ప్రభుత్వాలలో 252 మరియు 350 మంది సైనికులు చనిపోయారు. కావున పోస్ట్ లో ఇచ్చిన సంఖ్యలు అబద్ధం.

కేంద్ర హోం శాఖ రిలీజ్ చేసిన 2013-14 వార్షిక రిపోర్టు ప్రకారం, UPA హయంలో (అంటే 2009 నుండి 2014 వరకు) 252 మంది సైనికులు చనిపోతే; NDA హయంలో (2014 నుండి 2018 వరకు) 350 మంది సైనికులు చనిపోయినట్టు లోక్ సభ సమాధానం లో చూడవచ్చు. కావున పోస్ట్ లో ఇచ్చిన సంఖ్యలలో నిజం లేదు.

క్లెయిమ్ (దావా) 3: UPA (2009-14) మరియు NDA (2014-19) ప్రభుత్వాలలో 12 మరియు 210 మంది పౌరులు ఉగ్రవాద దాడుల్లో చనిపోయారు.

ఫాక్ట్ (నిజం): UPA (2009-14) మరియు NDA (2014-19) ప్రభుత్వాలలో 183 మరియు 134 మంది పౌరులు ఉగ్రవాద దాడుల్లో చనిపోయారు. కావున పోస్ట్ లో ఇచ్చిన సంఖ్యలు అబద్ధం.

కేంద్ర హోం శాఖ రిలీజ్ చేసిన 2013-14 వార్షిక రిపోర్టు ప్రకారం, UPA హయంలో (అంటే 2009 నుండి 2014 వరకు) 183 మంది పౌరులు ఉగ్రవాద దాడుల్లో చనిపోతే; NDA హయంలో (2014 నుండి 2018 వరకు) 134 మంది పౌరులు ఉగ్రవాద దాడుల్లో చనిపోయారని లోక్ సభ సమాధానం లో చూడవచ్చు. కావున పోస్ట్ లో చెప్పిన సంఖ్యలు తప్పు.

క్లెయిమ్ (దావా) 4: UPA (2009-14) మరియు NDA (2014-19) ప్రభుత్వాలలో పాకిస్తాన్‌ వైపు నుండి కాల్పుల ఉల్లంఘన సంఘటనలు 563 మరియు 5596 జరిగాయి.

ఫాక్ట్ (నిజం): UPA (2009-14) మరియు NDA (2014-19) ప్రభుత్వాలలో పాకిస్తాన్‌ వైపు నుండి కాల్పుల ఉల్లంఘన సంఘటనలు 628 మరియు 4370 జరిగాయి. కావున పోస్ట్ లో ఇచ్చిన సంఖ్యలు అబద్ధం.

సౌత్ ఆసియన్ టెర్రరిసం పోర్టల్ (SATP) వారు తమ వెబ్ సైట్ లో ప్రచురించిన సమాచారం ప్రకారం, UPA ప్రభుత్వ హయంలో లో 628 కాల్పుల ఉల్లంఘన సంఘటనలు జరిగితే NDA ప్రభుత్వ హయంలో 4370 కాల్పుల ఉల్లంఘన సంఘటనలు జరిగాయి. కావున పోస్ట్ లో ఇచ్చిన సంఖ్యలు తప్పు.

పైన వివరణ లో ఉపయోగించిన సంఖ్యలు అన్ని కేవలం జమ్మూ కాశ్మీర్ లో జరిగినవి మాత్రమే తీసుకోవడం జరిగింది , ఎందుకంటే ఆ రాష్ట్రం కి సంభందించిన డేటానే ప్రభుత్వ రిపోర్టుల్లో వివరంగా దొరుకుంతుంది. కేవలం అవి తీసుకుంటేనే పోస్ట్ లో ఇచ్చిన సంఖ్యల కంటే ఎక్కువగా వస్తున్నాయి, కాబట్టి వాటి ప్రకారమే పోస్ట్ లోని సంఖ్యలు తప్పు అనే నిర్ధారణకు రావొచ్చు.

చివరగా, పోస్ట్ లో UPA మరియు NDA ప్రభుత్వాలలో జరిగిన ఉగ్రవాద దాడులను పోలుస్తూ ఇచ్చిన సంఖ్యలలో ఎటువంటి నిజం లేదు.  

Share.

About Author

Comments are closed.

scroll