వీడియో లోని ఆత్మహత్య సంఘటన జరిగింది వరంగల్ లో కాదు, వెస్ట్ బెంగాల్ లోని మాల్డా టౌన్ రైల్వే స్టేషన్ లో

ఒక రైలు మీద నిల్చొని అక్కడ ఉన్న కరెంటు తీగని పట్టుకొని ఆత్మహత్య ప్రయత్నం చేస్తూ ఎలక్ట్రిక్ షాక్ కి గురి కాబడ్డ ఒక యువకుడి వీడియో ఫేస్ బుక్ లో విస్తృతంగా ప్రచారం కాబడుతుంది.  ఆ వీడియో ని పోస్ట్ చేస్తూ  ఆ ఘటన జరిగింది వరంగల్ లో అని ఒక పోస్ట్, కర్ణాటక లోని రాయచూర్ లో జరిగింది అని ఇంకొక పోస్ట్ క్లెయిమ్ చేస్తున్నాయి. ఆ క్లెయిమ్ లో ఎంతవరకు నిజం ఉందో  కనుక్కుందాం.

ఆర్కైవ్ చేసిన ఆ పోస్టులను ఇక్కడ మరియు ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: వరంగల్ రైల్వే స్టేషన్ లో రైలు మీద ఎక్కి కరెంటు తీగని పట్టుకుని ఆత్మహత్య చేసుకున్న ఒక యువకుడి వీడియో.

ఫాక్ట్ (నిజం): వీడియో లో యువకుడు కరెంటు వైర్ పట్టుకుని ఆత్మహత్యా ప్రయత్నం చేస్తున్న సంఘటన వెస్ట్ బెంగాల్ లోని మాల్డా రైల్వే స్టేషన్ దగ్గర జరిగింది. కావున, ఆ క్లెయిమ్ తప్పు

వీడియోలో చూపించిన యువకుడు కావాలనే ఆ కరెంటు తీగని పట్టుకున్నాడు అని అర్ధం అవుతుంది, కాబట్టి గూగుల్ లో ‘Man committing suicide by electrocution at a railway station’ అనే కీవర్డ్స్ ని ఉపయోగించి వెతికితే కొన్ని సెర్చ్ రిజల్ట్స్ లభించాయి. అందులోని ఒక సెర్చ్ రిజల్ట్ లో, ‘Hoodsite’ అనే న్యూస్ వెబ్సైటు వారి ఆర్టికల్ లో ఇదే వీడియో లభించింది. ఆ ఆర్టికల్ ద్వారా ‘బినోద్ భూయాన్’ అనే వ్యక్తి  వెస్ట్ బెంగాల్ లోని మాల్డా రైల్వే  స్టేషన్ లో ఎలక్ట్రిక్ షాక్ ద్వారా ఆత్మహత్యకి ప్రయత్నించాడని  అర్ధం అవుతుంది. ఆ  వివరాలని ఉపయోగించి ఇతర న్యూస్ రిపోర్ట్స్ కోసం వెతికితే ‘patrika’ వారు రాసిన ఒక ఆర్టికల్ కనిపించింది. ఆ ఆర్టికల్ లో కూడా ఆ వీడియో లో చూపించిన ఆత్మహత్య సంఘటన జరిగింది వెస్ట్ బెంగాళ్ లోని మాల్డా టౌన్ రైల్వే స్టేషన్ లో అని ఉంది.

చివరగా, వీడియో లో చూపించిన ఆత్మహత్య సంఘటన చోటు చేసుకున్నది వరంగల్ రైల్వే స్టేషన్ లో కాదు, అది జరిగింది వెస్ట్ బెంగాల్ లోని మాల్డా టౌన్ రైల్వే స్టేషన్ లో.

ఏది ఫేక్, ఏది నిజం సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?