Fake News, Telugu
 

2020 టోక్యో ఒలింపిక్స్ లో పాల్గొన్న వాలంటీర్లకు ‘స్వయంసేవక్’ పేరు ముద్రించిన పతకం ఏది బహుమతిగా ఇవ్వడం లేదు

0

టోక్యో ఒలంపిక్స్ వాలంటీర్లకు అందించనున్న పతకం పై ‘स्वयंसेवक’ (‘స్వయంసేవక్’) అనే హిందీ శాసనం ముద్రించినట్టు సోషల్ మీడియాలో ఒక ఫోటో షేర్ అవుతుంది. ఆ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం.

ఈ పోస్టు యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ని ఇక్కడ చూడవచ్చు

క్లెయిమ్: టోక్యో ఒలంపిక్స్ వాలంటీర్లకు అందించనున్న పతకం పై ‘స్వయంసేవక్’ అనే హిందీ శాసనం ముద్రించారు.

ఫాక్ట్ (నిజం): సోషల్ మీడియాలో షేర్ అవుతున్న ఈ పతకం, ‘e bay’ ఈ-కామర్స్ వెబ్సైటు లో టోక్యో ఒలింపిక్స్ నేపథ్యంతో విక్రయిస్తున్న ఒక బాడ్జ్ లేదా పిన్ అని తెలిసింది. ఈ బాడ్జ్ ఫోటోని ఇండియన్ ఒలింపిక్స్ అసోసియేషన్ (IOA) ప్రెసిడెంట్ Dr నరిందర్ ద్రువ్ బాత్ర తన అధికారిక ఫేస్బుక్ హేండిల్ లో షేర్ చేసి, ఆ తరువాత డిలీట్ చేసేసారు. టోక్యో ఒలంపిక్స్ 2021లో పనిచేసే వాలంటీర్లకు పతకం బహుమతిగా అందించనున్నట్టు టోక్యో ఒలంపిక్స్ అధికారులు ఎక్కడ ప్రకటించలేదు. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.

పోస్టులో షేర్ చేసిన పతకం కోసం టోక్యో ఒలింపిక్స్ 2020 వెబ్సైటులో వెతకగా, టోక్యో ఒలింపిక్స్ లో పాలుపంచుకునే వాలంటీర్లకు పతకం అందించనున్నట్టు గాని, ఆ పతకం పై ‘स्वयंसेवक’ అనే హిందీ శాసనం పేరు ముద్రించినట్టు గాని టోక్యో ఒలింపిక్స్ 2020 వెబ్సైటులో ఎక్కడా ప్రకటించలేదని తెలిసింది. విస్తారమైన రైలు రవాణ కలిగిన టోక్యో నగరంలో ప్రయాణానికి ఇబ్బంది కలుగకుండా వాలంటీర్లకు రోజుకి 1000 యెన్లు ఇవ్వనున్నట్టు టోక్యో ఒలింపిక్స్ వెబ్సైటులో తెలిపారు. టోక్యో ఒలింపిక్స్ 2020 లో పాల్గొనే వాలంటీర్లకు ఎలాంటి సర్టిఫికేషన్ ఇవ్వడం లేదని తమ వెబ్సైటులో స్పష్టంగా తెలిపారు. ఒక వేళ టోక్యో ఒలింపిక్స్ నిర్వహణ అధికారులు వాలంటీర్లకు పతకాలు అందించి, దాని పై స్వయంసేవక్ అనే హిందీ శాసనం ముద్రించి ఉంటే, ఆ విషయాన్నీ రిపోర్ట్ చేస్తూ పలు న్యూస్ సంస్థలు ఆర్టికల్స్ పబ్లిష్ చేసవి. కాని, దీనికి సంబంధింఛి ఎటువంటి న్యూస్ ఆర్టికల్ పబ్లిష్ అవ్వలేదు.

పోస్టులో షేర్ చేసిన పతకం ఫోటోని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసి వెతికితే, ఇదే పతకం యొక్క ఫోటో ‘e bay’ ఈ-కామర్స్ వెబ్సైటులో దొరికింది. ‘e bay’ వెబ్సైటులోని ఫోటోని జాగ్రత్తగా గమనిస్తే, ఈ ఫోటోలో కనిపిస్తుంది పతకం కాదు ఒక బాడ్జ్ లేదా పిన్ అని తెలిసింది. ‘e bay’ వెబ్సైటులో ఈ పిన్ ని ‘Olympic Tokyo2020 pin volunteer languages benevole volontair pin’ అనే టైటిల్ తో విక్రయిస్తున్నారు. టోక్యో ఒలింపిక్స్ వారు అందిస్తున్న అసలైన పతకాలని ఇక్కడ చూడవచ్చు.

టోక్యో ఒలింపిక్స్ నేపథ్యంతో షేర్ అవుతున్న ఈ పతకం ఫోటోని ఇండియన్ ఒలింపిక్స్ అసోసియేషన్ (IOA) ప్రెసిడెంట్ Dr నరిందర్ ద్రువ్ బాత్ర తన అధికారిక ఫేస్బుక్ హేండిల్ లో షేర్ చేసినట్టు తెలిసింది. ఈ బాడ్జ్ ఫోటో టోక్యో ఒలింపిక్స్ 2020కి సంబంధించింది కాదని తెలుసుకొన్న వెంటనే ద్రువ్ బాత్ర తన ఫేస్బుక్ పోస్టుని తీసేసారు. తనకు ఈ ఫోటో ఒకరు ఫార్వర్డ్ చేసారని, ఫోటోలోని పతకం టోక్యో ఒలింపిక్స్ 2020కి సంబంధించింది కాదని తెలుసుకొన్న వెంటనే తన పోస్టుని తీసేసినట్టు నరిందర్ ద్రువ్ బాత్ర ‘India Today’ కి తెలిపారు. ఈ వివరాల ఆధారంగా పోస్టులో షేర్ చేస్తున్న పతకం ఫోటో టోక్యో ఒలింపిక్స్ 2020కి సంబంధించింది కాదని ఖచ్చితంగా చెప్పవచ్చు.

చివరగా, 2020 టోక్యో ఒలింపిక్స్ లో పాల్గొన్న వాలంటీర్లకు ‘స్వయంసేవక్’ పేరు ముద్రించిన పతకం ఏది బహుమతిగా ఇవ్వడం లేదు.

Share.

About Author

Comments are closed.

scroll