కడప నుండి చెన్నై పోర్టుకి 30 కంటైనర్లలో నగదు తరలిస్తుండగా ED స్వాధీనం చేసుకుంది అనే ప్రచారం ఫేక్.

కడప నుండి చెన్నై పోర్టుకి 30 కంటైనర్లలో నగదు తరలిస్తుండగా ED స్వాధీనం చేసుకుంది అని చెప్తూ ఉన్న పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

క్లెయిమ్: కడప నుండి చెన్నై పోర్టుకి 30 కంటైనర్లలో నగదు తరలిస్తుండగా ED స్వాధీనం చేసుకుంది.

ఫాక్ట్(నిజం): కడప నుండి చెన్నై పోర్టుకి 30 కంటైనర్లలో నగదు తరలిస్తుండగా ED స్వాధీనం చేసుకున్నట్లు ఎటువంటి మీడియా రిపోర్ట్స్ లభించలేదు. అయితే, కడప నుండి చెన్నై పోర్టుకి కంటైనర్లలో రక్షణశాఖకు సంబంధించిన సామాగ్రిని తరలిస్తుండగా, కంటైనర్లలో ద్వారా వేలకోట్ల రూపాయల నగదు తరలిస్తున్నారంటూ కొంతమంది సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేసారని కడప డీఎస్పీ స్పష్టం చేశారు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.

ఈ వైరల్ పోస్టుకి సంబంధించిన సమాచారం కోసం తగిన కీవర్డ్స్ ఉపయోగించి ఇంటర్నెట్‌లో వెతకగా, కడప నుండి చెన్నై పోర్టుకి 30 కంటైనర్లలో తరలిస్తుండగా ED స్వాధీనం చేసుకున్నట్లు ఎటువంటి మీడియా రిపోర్ట్స్ లభించలేదు. అయితే కడప నుండి చెన్నై పోర్టుకి కంటైనర్లలో రక్షణశాఖకు సంబంధించిన సామాగ్రిని తరలిస్తుండగా, కంటైనర్లలో ద్వారా వేలకోట్ల రూపాయల నగదు తరలిస్తున్నారంటూ కొంతమంది సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేయడాన్ని రిపోర్ట్ చేస్తూ ప్రచురించిన పలు మీడియా కథనాలు మాకు లభించాయి (ఇక్కడ, ఇక్కడ & ఇక్కడ).

ఇదే అంశంపై కడప డీఎస్పీ స్పందిస్తూకంటైనర్లలో రక్షణశాఖకు సంబంధించిన సామాగ్రిని చెన్నై తరలిస్తున్నట్లు,సామాగ్రి వెళ్తున్న రూటులో ఎలాంటి అవాంతరాలు లేకుండా చూడాలన్న రక్షణ శాఖ విజ్ఞప్తి మేరకు, జిల్లా ఎస్.పి శ్రీ సిద్దార్థ్ కౌశల్ సూచనల ప్రకారం పోలీస్ ఎస్కార్ట్ ఇచ్చామన్నా్రు. ఈ నేపథ్యంలోనే వాస్తవాలను దాచి సోషల్ మీడియా వేదికగా అసత్యాలు, అభూతకల్పనలు ప్రచారం చేయడాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నామని, దుష్ప్రచారం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.” ఇదే విషయాన్ని రిపోర్ట్ చేస్తున్న మీడియా కథనాలు ఇక్కడ & ఇక్కడ చూడచ్చు.

అలాగే కడప జిల్లా పోలీసులు తమ అధికారిక X(ట్విట్టర్) ద్వారా కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేశారు.

ఒకవేళ నిజంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఇలాంటి భారీ నగదు స్వాధీనం చేసుకుంటే తమ వెబ్సైటులో ప్రెస్ రిలీజ్ రూపంలో తెలియచేస్తుంది. అటువంటి సమాచారమేదీ మాకు ఈడీ వెబ్సైటులో లభించలేదు.

చివరగా, కడప నుండి చెన్నై పోర్టుకి 30 కంటైనర్లలో రక్షణశాఖకు సంబంధించిన సామాగ్రిని తరలిస్తుండగా, కంటైనర్లలో నగదు తరలిస్తున్నారంటూ సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేసారు.