వీడియోలో కన్పిస్తున్నది లంగోవన్ (ఇండోనేషియా) లోని మార్కెట్, వుహాన్ (చైనా) లోని మార్కెట్ కాదు

జంతువులను అమ్ముతున్న మార్కెట్ కి సంబంధించిన వీడియో ని ఫేస్బుక్ లో పెట్టి, అందులో ఉన్నది కరోనా వైరస్ వ్యాప్తికి కారణంగా భావిస్తున్న వుహాన్ (చైనా) లోని మార్కెట్ అని పేర్కొంటున్నాను. పోస్టులో చెప్పిన విషయం ఎంతవరకు వాస్తవమో విశ్లేషిద్దాం.

ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: వుహాన్ (చైనా) లో జంతువులను అమ్మే మార్కెట్ వీడియో.

ఫాక్ట్ (నిజం): వీడియోలో కన్పిస్తున్నది లంగోవన్ (ఇండోనేషియా) లో జంతువులను అమ్మే మార్కెట్, వుహాన్ (చైనా) లోని మార్కెట్ కాదు. కావున, పోస్టు లో చెప్పింది తప్పు.

వీడియో మొదలయ్యేటప్పుడు, ‘Pasar EXTREME Langowan’ అనే పదాలు వీడియో మీద చూడవచ్చు. (దాని తెలుగు అనువాదం- ‘మార్కెట్ ఎక్స్ట్రీమ్ లంగోవన్’). ఆ పదాలతో గూగుల్ లో వెతికినప్పుడు, అలాంటివే చాలా వీడియోలు సెర్చ్ రిజల్ట్స్ లో వచ్చాయి. ఒక యూట్యూబ్ వినియోగదారుడు, అదే వీడియో ని, డిసెంబర్ 2019 లో ‘VIRALL Pasar EXTREME Langowan INDONESIA’ అనే టైటిల్ తో అప్లోడ్ చేసాడు. ‘లంగోవన్’ అనేది ఇండోనేషియా లోని ఒక ప్రాంతం.

వీడియోలో 0.20 సెకండ్స్ దగ్గర, ఒక పోస్టర్ మీద ‘KANTOR PASAR LANGOWAN’ అని రాసి ఉండడం చూడవచ్చు. దాని తెలుగు అనువాదం- ‘లంగోవన్ మార్కెట్ ఆఫీస్’. దీనిని బట్టి వీడియోలో కన్పిస్తున్నది లంగోవన్ (ఇండోనేషియా) లో జంతువులను అమ్మే మార్కెట్ అని తెలుస్తుంది.

అంతేకాదు, లంగోవన్ మార్కెట్ కి సంబంధించి ‘Getty Images’ వెబ్సైటులో ఉన్న ఫొటోస్ ని మరియు వీడియోలోని విజువల్స్ ని పోల్చినప్పుడు, అవి ఒకేలా ఉండడం కూడా గమనించవచ్చు.

చివరగా, వీడియోలో కన్పిస్తున్నది లంగోవన్ (ఇండోనేషియా) లోని మార్కెట్, వుహాన్ (చైనా) లోనిది కాదు.

ఏది ఫేక్, ఏది నిజం సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?