అహ్మదాబాద్‌ సివిల్ హాస్పిటల్ ముందు అంబులెన్స్‌లు క్యూ కట్టిన వీడియోని, మహారాష్ట్ర వీడియోగా షేర్ చేస్తున్నారు

మహారాష్ట్రలో పరిస్థితి చాలా దారుణంగా ఉంది. అంబులెన్స్ లో ట్రీట్మెంట్ ఇస్తున్న దృశ్యం’, అని చెప్తూ ఒక వీడియోని సోషల్ మీడియాలో కొందరు షేర్ చేస్తున్నారు. మహారాష్ట్ర లో కోవిడ్-19 కేసులు ఎక్కువ ఉన్న నేపథ్యంలో ఈ వీడియోని షేర్ చేస్తున్నారు. ఆ పోస్ట్ లో ఎంతవరకు నిజముందో చూద్దాం.

ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: మహారాష్ట్రలో అంబులెన్స్ లోనే కోవిడ్-19 ట్రీట్మెంట్ ఇస్తున్న దృశ్యాలు.

ఫాక్ట్: పోస్ట్ లోని వీడియో మహారాష్ట్ర కి సంబంధించినది కాదు. వీడియోలో కనిపిస్తున్నది గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్‌ సివిల్ హాస్పిటల్. కావున పోస్ట్ లో చెప్పింది తప్పు.

పోస్ట్ లోని వీడియో యొక్క స్క్రీన్ షాట్స్ ని గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ లో వెతకగా, అలాంటి వీడియోనే ఒకటి ‘న్యూస్ 24’ వారు 15 ఏప్రిల్ 2021న ట్వీట్ చేసినట్టు తెలిసింది. ఆ వీడియో అహ్మదాబాద్‌ సివిల్ హాస్పిటల్ దగ్గర తీసినట్టు ఆ ట్వీట్ లో చదవొచ్చు. ‘న్యూస్ 24’ వారి వీడియోలో కూడా పోస్ట్ లోని వీడియోలో కనిపిస్తున్న హాస్పిటల్ బిల్డింగ్ మరియు గేట్ లను చూడవొచ్చు.

అహ్మదాబాద్‌ సివిల్ హాస్పిటల్ దగ్గర అంబులెన్స్‌లు క్యూ కట్టిన వార్తను వివిధ వార్తా సంస్థలు ప్రచురించాయి. వాటిలో కొన్ని న్యూస్ ఆర్టికల్స్ ని ఇక్కడ, ఇక్కడ, మరియు ఇక్కడ చదవొచ్చు.

చివరగా, వీడియోలో కనిపిస్తున్నది గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్‌ సివిల్ హాస్పిటల్. వీడియో మహారాష్ట్ర కి  సంబంధించినది కాదు.