బిడ్డను పట్టుకొని రైల్వే కోచ్‌ల మధ్య కోర్చోని వెళ్తున్న మహిళ వీడియో చాలా పాతది

ఎంత కష్టమొచ్చింది తల్లీ నీకు ! నా మనస్సు తల్లడిల్లింది నీ అవస్థ చూసి. ఎందుకు ఈ అభివృధ్ది ఎందుకు ఈ సంపద. నాకు దుఃఖం ఆగటంలేదు । అన్నీ ఉన్నా నీకేమి చేయలేకపోతున్నా । నన్ను క్షమించు తల్లీ !’ అంటూ ఒక చేతిలో బిడ్డను, మరో చేత్తో రైలును పట్టుకొని రైల్వే కోచ్‌ల మధ్య కోర్చోని వెళ్తున్న ఒక మహిళ వీడియోని చాలా మంది సోషల్ మీడియా లో షేర్ చేస్తున్నారు. ఫేస్బుక్ లో కూడా ఆ వీడియో వైరల్ అవుతున్నట్టు తెలుస్తుంది. లాక్ డౌన్ కారణంగా వలస కార్మికులు వివిధ కష్టాల మధ్య తమ గ్రామాలకు వెళ్తున్న వీడియోలు మరియు ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ అవుతున్న సమయంలో ఈ వీడియో పెట్టినందున, ఇది కూడా తాజా వీడియో అని అందరు భావిస్తున్నారు. అయితే, అది ఒక పాత వీడియో అని FACTLY విశ్లేషణలో తేలింది. కనీసం 2016 నుండి ఇంటర్నెట్ లో షేర్ చేయబడుతుంది. అంతేకాదు, అది బంగ్లాదేశ్ కి సంబంధించిన వీడియో అని కూడా కొందరు షేర్ చేస్తున్నారు. కానీ, అది ఎక్కడ తీసారో కచ్చితమైన సమాచారం దొరకలేదు.  

సోర్సెస్:
క్లెయిమ్ – 
1. ఫేస్బుక్ పోస్ట్ (ఆర్కైవ్డ్)
2. ట్వీట్ (ఆర్కైవ్డ్)
ఫాక్ట్ 
1. యూట్యూబ్ వీడియో – https://www.youtube.com/watch?v=9uN8-DAlNfs
2. యూట్యూబ్ వీడియో – https://www.youtube.com/watch?v=E8-9DHfiHJM

Did you watch our new video?