SP మరియు BJP కార్యకర్తల ఘర్షణ వీడియోని BJP కార్యకర్తలను రైతులు కొడుతున్నట్టు షేర్ చేస్తున్నారు

కొందరు వ్యక్తులు గొడవపడుతున్న  వీడియోని, ఉత్తరప్రదేశ్ లో BJP నేతలను కొడుతున్న రైతులంటూ షేర్ చేస్తున్న పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో షేర్ అవుతుంది. ఈ కథనం ద్వారా ఆ వార్తలో  ఎంత నిజముందో చూద్దాం.

క్లెయిమ్: ఉత్తరప్రదేశ్ లో BJP నేతలను రైతులు కొడుతున్న వీడియో.

ఫాక్ట్ (నిజం): ఈ వీడియో ఉత్తరప్రదేశ్ లోని గోరఖ్‌పూర్ లో 26 జూన్ 2021న జిల్లా పంచాయత్ ప్రెసిడెంట్ పోస్ట్ నామినేషన్ సందర్భంగా SP మరియు BJP కార్యకర్తల మధ్య జరిగిన గొడవకు సంబంధించింది. చాలా వార్తా సంస్థలు ఈ వీడియోని రిపోర్ట్ చేసాయి. ఈ వీడియోకి రైతులకి ఎటువంటి సంబంధంలేదు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.

ఉత్తరప్రదేశ్ లోని గోరఖ్‌పూర్ లో 26 జూన్ 2021న జిల్లా పంచాయత్ ప్రెసిడెంట్ పోస్ట్ నామినేషన్ సందర్భంగా SP మరియు BJP కార్యకర్తల మధ్య గొడవ జరిగింది. ఈ వీడియో ఆ గొడవకి సంబంధించిందే. పోస్టులోని వీడియో యొక్క స్క్రీన్ షాట్స్ ని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా, ఇదే వీడియోని రిపోర్ట్ చేసిన కొన్ని వార్తా కథనాలు మాకు కనిపించాయి. టైమ్స్ అఫ్ ఇండియా ప్రచురించిన కథనంలో  కూడా ఈ వీడియోని గోరఖ్‌పూర్ డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ కార్యాలయం ఎదుట SP మరియు BJP కార్యకర్తల మధ్య గొడవదంటూ పేర్కొంది. 

ఈ ఘటనని రిపోర్ట్ చేసిన మరొక న్యూస్ వీడియో ఇక్కడ చూడొచ్చు. ఈ రిపోర్ట్ కూడా ఈ వీడియోలో ఘర్షణ పడుతున్నది ఉత్తరప్రదేశ్ లోని SP మరియు BJP కార్యకర్తలేనని ద్రువీకరిస్తోంది. ఈ ఘటనకి సంబంధించి మరొక వార్తా కథనం ఇక్కడ చూడొచ్చు. దీన్ని బట్టి, ఈ వీడియోకి రైతులకి ఎటువంటి సంబంధంలేదని స్పష్టమవుతుంది.

చివరగా, గోరఖ్‌పూర్ లో SP మరియు BJP కార్యకర్తల మధ్య జరిగిన ఘర్షణకు సంబంధించిన వీడియోని BJP కార్యకర్తలను రైతులు కొడుతున్నట్టు తప్పుగా షేర్ చేస్తున్నారు.