భౌతిక దూరం పాటించకుండా జనాలు గుంపులుగా షాపింగ్ చేస్తున్న ఒక వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేసి తెలంగాణ ప్రభుత్వం లాక్ డౌన్ సడలించిన తరువాత చార్మినార్ (హైదరాబాద్), మదీనా దగ్గర పరిస్థితి అని చెప్తున్నారు. దీంట్లో ఎంతవరకు నిజం ఉందో చూద్దాం.
క్లెయిమ్: చార్మినార్ (హైదరాబాద్), మదీనా ప్రాంతం దగ్గర భౌతిక దూరం పాటించకుండా జనాలు గుంపులుగా షాపింగ్ చేస్తున్న వీడియో.
ఫాక్ట్ (నిజం): ఆ వీడియో ఫైసలాబాద్ (పాకిస్థాన్) లోని న్యూ అనార్కలి బజార్ లో తీశారు. ఆ వీడియోకి హైదరాబాద్ కి (తెలంగాణ) ఎటువంటి సంబంధం లేదు. కావున పోస్ట్ లో చెప్పింది తప్పు.
పోస్ట్ లోని వీడియో యొక్క స్క్రీన్ షాట్స్ ని గూగుల్ రివర్స్ ఇమేజ్ టెక్నిక్ ద్వారా వెతికితే, యూట్యూబ్ లో అప్లోడ్ చేసిన అదే వీడియో, ‘New Anarkali Faisalabad 18 May k taaza manazir’ అనే శీర్షిక తో కనిపించింది. ఫైసలాబాద్, పాకిస్థాన్ లో ఒక పట్టణం. అంతేకాక, అదే వీడియోని హైదరాబాద్ (భారత దేశం) సందర్భం లో ఉపయోగించకముందే, పాకిస్థాన్ కి చెందిన పలువురు ఫేస్బుక్ లో 18 మే 2020న న్యూ అనార్కలి బజార్ (ఫైసలాబాద్, పాకిస్థాన్) పరిస్థితి అని పోస్ట్ చేసారు. పాకిస్థాన్ కి చెందిన ఒక వెరిఫైడ్ ట్విట్టర్ యూసర్ కూడా ఆ వీడియో లో ఉన్న సంఘటన ఫైసలాబాద్ మార్కెట్ లో జరిగిందని పెట్టిన ట్వీట్ ఇక్కడ చూడవచ్చు.
అంతే కాదు, పోస్టులోని వీడియో లో 10 సెకండ్ల దగ్గర ఉర్దూ పదాలతో (ట్రాన్సలేషన్ – ‘ఐని షూస్’) ఉన్న ఒక ప్లకార్డు ని గమనించవచ్చు. గూగుల్ మాప్స్ లో కూడా ఫైసలాబాద్ లోని న్యూ అనార్కలి బజార్ దగ్గర ‘ఐని షూస్‘ అనే షాప్ ఉన్నదని చూడవచ్చు.
అంతేకాక, తెలంగాణ ప్రభుత్వం గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (GHMC) పరిధి లో పక్క-పక్కన ఉన్న షాపులు దినం తప్పి దినం తెరవాలని 19 మే 2020 న అనుమతి ఇచ్చింది. కానీ, పోస్ట్ లోని వీడియో ఇంటర్నెట్ లో మొదటిసారి 18 మే 2020 నుండే కనిపించింది. చార్మినార్ ప్రాంతంలో షాప్ తప్పించి షాప్ తెరిచి ఉండడం ఇక్కడ చూడవచ్చు.
చివరగా, పాకిస్థాన్ కి సంబంధించిన వీడియోను చార్మినార్ (హైదరాబాద్) ప్రాంతం లో భౌతిక దూరం పాటించకుండా జనాలు గుంపులుగా షాపింగ్ చేస్తున్న వీడియో అని తప్పుగా ప్రచారం చేస్తున్నారు.
‘మీకు తెలుసా’ సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?