కాలేజీల్లో మొబైల్ ఫోన్ల వాడకాన్ని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం నిషేదించలేదు

కాలేజీ మరియు యూనివర్సిటీల్లో మొబైల్ ఫోన్ల వాడకాన్ని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం నిషేదించినట్టు ఉన్న ఒక పోస్ట్ ని సోషల్ మీడియా లో చాలా మంది షేర్ చేస్తున్నారు. ఆ పోస్ట్ లో ఎంతవరకు నిజముందో విశ్లేషిద్ధాం.

ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: కాలేజీ మరియు యూనివర్సిటీల్లో మొబైల్ ఫోన్స్ వాడకాన్ని నిషేధించిన ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం. 

ఫాక్ట్ (నిజం): కాలేజీ మరియు యూనివర్సిటీల్లో మొబైల్ ఫోన్స్ వాడకాన్ని నిషేధిస్తూ తాము ఎటువంటి సర్కులర్ ని రిలీజ్ చేయలేదని ‘Directorate of Higher Education (ఉత్తరప్రదేశ్)’ వారు వివరణ ఇచ్చారు. కావున పోస్ట్ లో చెప్పింది తప్పు.  

పోస్ట్ లోని విషయం గురించి గూగుల్ లో ‘మొబైల్‌ ఫోన్ల వాడకంపై నిషేధం’ అని వెతకగా, ప్రముఖ వార్తాసంస్థలు [టీవీ9 (ఆర్కైవ్డ్), ఈనాడు (ఆర్కైవ్డ్), ఆంధ్రజ్యోతి (ఆర్కైవ్డ్), సాక్షి (ఆర్కైవ్డ్), హెచ్ఎంటీవీ (ఆర్కైవ్డ్), 10టీవీ (ఆర్కైవ్డ్), T న్యూస్ (ఆర్కైవ్డ్), ఆంధ్రప్రభ (ఆర్కైవ్డ్), మైక్ టీవీ (ఆర్కైవ్డ్), నవతెలంగాణ (ఆర్కైవ్డ్), వన్ఇండియా తెలుగు (ఆర్కైవ్డ్) మరియు ap7am (ఆర్కైవ్డ్)] కూడా అదే విషయాన్ని ప్రచురించినట్టుగా చూడవొచ్చు.

వార్తాసంస్థలు ప్రచురించిన ఆర్టికల్స్ లో కాలేజీ మరియు యూనివర్సిటీల్లో మొబైల్ ఫోన్స్ వాడకాన్ని నిషేధిస్తూ ‘Directorate of Higher Education (ఉత్తరప్రదేశ్)’ వారు సర్కులర్ రిలీజ్ చేసినట్టుగా ఉంటుంది. కావున, ఆ సర్కులర్ కోసం ‘Directorate of Higher Education (ఉత్తరప్రదేశ్)’ వారి వెబ్ సైట్ లో వెతకగా, ఆ సర్కులర్ ఎక్కడా కూడా కనిపించదు. కానీ, ఈ వార్త పై వారు ఇచ్చిన వివరణని ఆ వెబ్ సైట్ లోని ‘న్యూస్’ సెక్షన్ లో చూడవొచ్చు. వివరణ లో వందన శర్మ (డైరెక్టర్, ఉన్నత విద్య, ఉత్తరప్రదేశ్) మాట్లాడుతూ మీడియా లో వస్తున్న వార్తలను ఖండించారు. తాము అటువంటి సర్కులర్ ని అసలు రిలీజ్ చేయలేదని కూడా తెలిపింది. అంతేకాదు, ఉత్తరప్రదేశ్ డిప్యూటీ సీ.ఎం. మాట్లాడుతూ కాలేజీ మరియు యూనివర్సిటీల్లో మొబైల్ ఫోన్స్ వాడకాన్ని నిషేధిస్తూ తమ ప్రభుత్వం ఎటువంటి ఆర్డర్ ఇవ్వలేదని తెలిపినట్టు ‘Hindustan Times’ ఆర్టికల్ లో చూడవొచ్చు.

చివరగా, కాలేజీల్లో మొబైల్ ఫోన్ల వాడకాన్ని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం నిషేదించలేదు. అది ఒక ఫేక్ న్యూస్.

ఏది ఫేక్, ఏది నిజం సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?