ఈ ఫోటోలో చూపిస్తున్నది వైజాగ్ లోని NAD ఫ్లైఓవర్ యొక్క అసలు డిజైన్ కాదు

వైజాగ్ లోని నిర్మాణం పూర్తయిన NAD ఫ్లైఓవర్ కి ఆ ఫ్లైఓవర్ యొక్క అసలు డిజైన్ కి చాలా వ్యత్యాసం ఉందని అర్ధం వచ్చేలా ఫ్లైఓవర్ మరియు అసలు డిజైన్ యొక్క ఫోటో కోలాజ్ షేర్ చేసిన పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఈ డిజైన్ నిజమా అని అడుగుతూ కొందరు ఇదే ఫోటోని FACTLY వాట్సాప్ టిప్ లైన్ నెంబర్ 9247052470 కి కూడా పంపించారు. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: వైజాగ్ లోని NAD ఫ్లైఓవర్ యొక్క అసలు డిజైన్.

ఫాక్ట్ (నిజం): పోస్టులో వైజాగ్ లోని NAD ఫ్లైఓవర్ అసలు డిజైన్ అని చెప్తున్నది నిజానికి NAD ఫ్లైఓవర్ కి సంబంధించిందికాదు, ఈ ఫ్లైఓవర్ డిజైన్ చాలా సంవత్సరాల నుండి ఇంటర్నెట్ లో అందుబాటులో ఉంది, ఈ ఫోటో ఉక్రెయిన్ లో నిర్మించబోయే ఒక ఫ్లైఓవర్ కి సంబంధించిన డిజైన్ అని చెప్తూ కొన్ని 2010, 2012 సంవత్సరంకి చెందిన వార్తా కథనాలు ఉన్నాయి. వైజాగ్ లోని NAD ఫ్లైఓవర్ అసలు డిజైన్స్ కి పోస్టుల్లో చూపిస్తున్న డిజైన్స్ కి పొంతన లేదు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.

గూగుల్ లో ‘vizag NAD flyover’ అనే కీవర్డ్ తో వెతకగా ఈ ఫ్లైఓవర్ కి సంబంధించిన అసలు డిజైన్ ని ప్రచురించిన వార్తా కథనాలు మరియు న్యూస్ రిపోర్టింగ్ వీడియోస్ అనేకం మాకు కనిపించాయి. ఈ కథనాలలో ప్రచురించిన ఫ్లైఓవర్ యొక్క డిజైన్స్ కి పోస్టులో చెప్తున్న అసలు డిజైన్ కి చాలా వత్యాసం గమనించొచ్చు. దీన్నిబట్టి పోస్టులో చూపిస్తున్నది వైజాగ్ లోని NAD ఫ్లైఓవర్ కి సంబంధించిన డిజైన్ కాదని చెప్పొచ్చు.

పోస్టులో ఒరిజినల్ డిజైన్ గా చెప్తున్న ఫోటోని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా ఈ ఫోటోని షేర్ చేసిన చాలా సోషల్ మీడియా పోస్టులు మరియు వార్తా కథనాలు మాకు కనిపించాయి. ఈ ఫోటో ఉక్రెయిన్ లో నిర్మించబోయే ఒక ఫ్లైఓవర్ కి సంబంధించిన డిజైన్ అని చెప్పే కొన్ని 2010, 2012 సంవత్సరంకి చెందిన వార్తా కథనాలు మాకు కనిపించాయి. ఐతే ఈ ఫోటోకి సంబంధించిన కచ్చితమైన సమాచారం దొరకనప్పటికి ఈ వార్తా కథనాల తేదీల ఆధారంగా ఈ ఫోటోకి వైజాగ్ లోని NAD ఫ్లైఓవర్ కి సంబంధంలేదని చెప్పొచ్చు.

చివరగా, సంబంధం లేని పథ ఫోటోని చూపిస్తూ ఇది వైజాగ్ లోని NAD ఫ్లైఓవర్ యొక్క అసలు డిజైన్ అని ప్రచారం చేస్తున్నారు.