ఇకపై 11 అంకెల మొబైల్ నంబర్స్ వినియోగించాలి అని టెలికాం నియంత్రణ సంస్థ (TRAI) ప్రభుత్వానికి సూచించలేదు

మొబైల్ నంబర్స్ విషయంలో టెలికాం నియంత్రణ సంస్థ(TRAI) ఇక నుంచి 11 అంకెల నంబర్స్ ఉన్న మొబైల్ నంబర్స్ ను వినియోగించాలని ప్రతిపాదించిందని అంటూ ఒక పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆ పోస్టులో ఎంత వరకు నిజం ఉందో చూద్దాం.

ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: దేశంలో 10 అంకెల మొబైల్ నంబర్స్ స్థానంలో 11 అంకెల మొబైల్ నంబర్స్ వినియోగించాలి అని TRAI ప్రతిపాదించింది.    

ఫాక్ట్ (నిజం): నంబరింగ్ రిసోర్సెస్ పెంచడం కోసం, 10 అంకెల మొబైల్ నంబర్స్ ను 11 అంకెలగా పెంచి వినియోగించడం ఒక పరిష్కారంగా మాత్రమే TRAI తాజాగా విడుదల చేసిన డాకుమెంట్లో పేర్కొంది. అయితే, తాము ఆ సలహాని తిరస్కరించామని, 11 నంబర్స్ ఉన్న మొబైల్ నంబర్స్ వినియోగించాలని ప్రభుత్వానికి సిఫారసు చేయలేదని ట్వీట్ చేసి TRAI స్పష్టం చేసింది. కావున పోస్టులో చేసిన క్లెయిమ్ తప్పు

పోస్టులో చేసిన క్లెయిమ్ కోసం వెతకగా, టెలికాం నియంత్రణ సంస్ధ (TRAI) 29 మే 2020  న రిలీజ్ చేసిన ‘Ensuring Adequate Numbering Resources for Fixed Line and Mobile Services’  అనే టైటిల్ తో ఉన్న డాకుమెంట్లో, నంబరింగ్ రిసోర్సెస్ పెంచడానికి  వినియోగంలో ఉన్న 10 అంకెల మొబైల్ నంబర్స్ ను 11 అంకెలుగా గా పెంచి వినియోగించడం ఒక పరిష్కారంగా పేర్కొన్నట్టు తెలిసింది. ఈ సమాచారాన్ని ఆ డాకుమెంట్లో  ‘Estimated requirement of Numbering Resources: Possible Solutions’ అనే విషయం కింద చదవచ్చు. 11 అంకెల మొబైల్ నంబర్స్ వినియోగించడం పై TRAI అభిప్రాయాన్ని కింద ఫోటోలో చదవొచ్చు.

TRAI ’11 అంకెల’ మొబైల్ నెంబర్లు వినియోగించమని ప్రభుత్వానికి సూచించింది అంటూ సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో, దానికి TRAI సమాధానం ఇస్తూ, ‘తాము ఆ సలహాని నంబరింగ్ రిసోర్సెస్ పెంచడానికి ఒక పరిష్కారంగా మాత్రమే ఆ డాకుమెంట్లో పేర్కొన్నామని, 11 అంకెల మొబైల్ నెంబర్లను వినియోగించాలనే ఆలోచన తాము తిరస్కరించామని, ప్రభుత్వానికి ఆ ఆలోచన తాము ప్రతిపాదించలేదు’ అని ప్రెస్ రిలీజ్ ఇచ్చింది.

ల్యాండ్ లైన్ నుండి మొబైల్ కి కాల్ చేస్తున్నపుడు ‘0’ ఆడ్ చెయ్యాలని మాత్రమే సూచించామని, దాన్ని కొన్ని మీడియా చానల్స్ తప్పుగా షేర్ చేస్తున్నారు అంటూ తమ ప్రెస్ రిలీజ్ లో TRAI పేర్కొనింది. ప్రెస్ రిలీజ్ ని తమ ట్విట్టర్ అకౌంట్ లో పోస్ట్ చేసింది.

చివరగా, 11 ఆంకెల మొబైల్ నంబర్స్ వినియోగంలోకి తేవాలని TRAI ప్రభుత్వానికి సూచించలేదు.

‘మీకు తెలుసా’ సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?