Fake News, Telugu
 

‘టూల్ కిట్’ కేసులో అరెస్ట్ అయిన దిశా రవి పూర్తి పేరు ‘దిశా రవి జోసెఫ్’ కాదు, తను క్రిస్టియన్ కాదు

0

గ్రెటా థన్ బర్గ్ ‘టూల్ కిట్’ కేసులో అరెస్ట్ అయిన దిశా రవి పూర్తి పేరు ‘దిశా రవి జోసెఫ్’ అని సోషల్ మీడియాలో ఒక పోస్ట్ షేర్ అవుతుంది. అంతేకాదు, తను కేరళకి చెందిన సిరియన్ క్రిస్టియన్ అని మరొక పోస్టులో క్లెయిమ్ చేసారు.  ‘టూల్ కిట్’ కేసులో అరెస్ట్ అయిన దిశా రవి గురించి ఈ ఆర్టికల్ లో చదవచ్చు. ఆ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం.               

ఈ పోస్టుల యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్లు ఇక్కడ, ఇక్కడ చూడవచ్చు

క్లెయిమ్: ‘టూల్ కిట్’ కేసులో అరెస్ట్ అయిన దిశా రవి పూర్తి పేరు దిశా రవి జోసెఫ్. తను కేరళకు చెందిన క్రిస్టియన్.

ఫాక్ట్ (నిజం): గ్రెటా థన్ బర్గ్ ‘టూల్ కిట్’ కేసులో అరెస్ట్ అయిన దిశా రవి పూర్తి పేరు ‘దిశా అనప్ప రవి’, ‘దిశా రవి జోసెఫ్’ కాదు. దిశా రవి యొక్క వోటర్ కార్డు వివరాలలో తన పేరు ‘Disha A Ravi’ అని, తన తండ్రి పేరు ‘Ravi Annappa’ అని రాసి ఉంది. ఒక న్యూస్ ఆర్టికల్ లో దిశా రవి ఒక హిందూ కుటుంబానికి చెందిన వ్యక్తని తెలిపారు. తను లింగాయత్ సముదాయానికి చెందిన ఇంట్లో పెరిగిందని ఈ ఆర్టికల్ లో తెలిపారు. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.

దిశా రవికి సంబంధించిన వివరాల కోసం కర్ణాటక చీఫ్ ఎలెక్టోరల్ ఆఫీసర్ వెబ్సైటులో వెతికితే, దిశా రవి వోటర్ ID వివరాలు దొరికాయి. ఈ వోటర్ ID వివరాలలో తన పేరు ‘Disha A Ravi’ అని, తన తండ్రి పేరు ‘Ravi Annappa’ అని రాసి ఉంది. తన పేరులో జోసెఫ్ అనే పదం ఎక్కడ తగిలించి లేదు.

ఈ వివరాల ఆధారంగా దిశా రవికి సంబంధించిన మరింత సమాచారం కోసం వెతికితే, దిశా రవి మతానికి సంబంధించిన వివరాలని స్పష్టం చేస్తూ ఒక ఆర్టికల్ పబ్లిష్ అయినట్టు తెలిసింది. ఈ ఆర్టికల్ లో దిశా రవి  ఒక హిందూ కుటుంబానికి చెందిన వ్యక్తని స్పష్టం చేసారు. దిశా రవి పూర్తి పేరు ‘Disha Annappa Ravi’ అని ఈ ఆర్టికల్ లో తెలిపారు.

దిశా రవి అమ్మ పేరు మంజుల అని, తండ్రి పేరు అన్నప్ప రవి అని, దిశా కుటుంబానికి సన్నిహితుడైన లాయర్ ప్రసన్న తెలిపినట్టు ఈ ఆర్టికల్  రిపోర్ట్ చేసింది. దిశా రవి కుటుంబం కర్ణాటక రాష్ట్రం తుమ్కూర్ జిల్లాలోని టిప్తూర్ గ్రామానికి చెందిన వారని లాయర్ ప్రసన్న మీడియాకి తెలిపారు. దిశా రవి ఒక లింగాయత్ సముదాయానికి చెందిన ఇంట్లో పెరిగినప్పటికీ, తను మతాన్ని ఎప్పుడు అనుసరించేది కాదని ఆయన తెలిపారు. Mount Carmel కాలేజీలో జరిగిన 2018 వార్షికోత్సవ దినోత్సవానికి సంబంధించిన రిపోర్ట్ ని BOOM ఫాక్ట్ చెకింగ్ సంస్థ దొరకబట్టింది. ఈ రిపోర్టులో, దిశా రవి తను ‘Carpe Diem’ బిజినెస్ ఫెస్టివల్ లో పాల్గొన్న అనుభవాన్ని షేర్ చేసుకుంది. ఈ రిపోర్టులో తన పేరు ‘Disha A Ravi’ అని రాసి ఉంది.

చివరగా, ‘టూల్ కిట్’ కేసులో అరెస్ట్ అయిన దిశా రవి క్రిస్టియన్ కాదు. అలాగే, తన పూర్తి పేరు దిశా అనప్ప రవి, దిశా రవి జోసెఫ్ కాదు.

Share.

About Author

Comments are closed.

scroll