రామ సేతు అవశేషాలను స్కూబా డైవర్లు అన్వేషిస్తున్నట్లు చూపించే ఈ వైరల్ వీడియో AI వాడి జనరేట్ చేసింది.

 రామ సేతు అవశేషాలను స్కూబా డైవర్లు అన్వేషిస్తున్న దృశ్యాలు అని చెప్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో(ఇక్కడ,ఇక్కడ మరియు ఇక్కడ) వైరల్ అవుతోంది. ‘సముద్ర అంతర్భాగంలో శ్రీ రామ సేతు దృశ్యాలు.. అద్భుతం.. మహాద్భుతం..’అని చెప్తూ ఈ వీడియోని నెటిజన్లు ఈ వీడియోని షేర్ చేస్తున్నారు. అసలు, ఈ క్లెయిమ్ వెనుక ఎంత నిజం ఉందో ఈ ఆర్టికల్ ద్వారా చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ మీరు ఇక్కడ చూడవచ్చు. 

క్లెయిమ్: రామ సేతు అవశేషాలను స్కూబా డైవర్లు అన్వేషిస్తున్న దృశ్యాలను చూపిస్తున్న వీడియో.

ఫ్యాక్ట్(నిజం): ఇది AI-ద్వారా రూపొందించబడిన వీడియో, నిజంగా రామ సేతు దగ్గర స్కూబా డైవర్లు అన్వేషిస్తున్నప్పుడు తీసిన వీడియో కాదు. కాబట్టి, పోస్ట్‌లో చేస్తున్న క్లెయిమ్ తప్పు .

ముందుగా, వైరల్ క్లెయిమును వెరిఫై చేయడానికి తగిన కీవర్డ్స్ ఉపయోగించి ఇంటర్నెట్లో వెతికాము. ఈ సెర్చ్ ద్వారా మాకు ఇటీవల స్కూబా డైవర్లు రామసేతును అన్వేషించిన వీడియోలు ఉన్న ఎటువంటి వార్తా కథనాలు దొరకలేదు.

రామ సేతు యొక్క ప్రాచీనత మరియు మూలాల్ని నిర్ణయించడానికి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ వారు 2021లో నీటి అడుగున ఒక అధ్యయనాన్ని జరపాలి అని ప్రతిపాదించారు అని ఈ సెర్చ్ ద్వారా మాకు తెలిసింది. అలాగే జూలై 2024లో, ఇస్రో శాస్త్రవేత్తలు, NASA యొక్క ICESat-2 ఉపగ్రహాన్ని ఉపయోగించి, రామ సేతు యొక్క మొదటి వివరణాత్మక under sea map(సముద్రగర్భ పఠం) రూపొందించారు(ఇక్కడ,ఇక్కడ). కానీ, ఇటీవల(7 ఏప్రిల్ 2025 నాటికి) రామ సేతు దగ్గర స్కూబా డైవింగ్ అన్వేషణలు జరిపినట్లు మాకు ఎటువంటి వార్తా కథనాలు దొరకలేదు.ఆ తర్వాత, వైరల్ వీడియోలోని కీఫ్రేమ్‌లను రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా, @bharathfx (Bharath FX) అనే ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో మాకు ఈ వీడియో దొరికింది.

దీన్ని తను 27 మార్చి 2025న అప్లోడ్ చేశాడు. ఈ పోస్ట్ యొక్క వివరణ బట్టి ఈ వీడియో AI ఉపయోగించి తయారు చేసిన విజువల్స్ వాడి ఎడిట్ చేయబడింది. 

ఈ విషయన్ని నిర్దార్నిచ్చడానికి, AI-జనరేటెడ్ వీడియోలను డిటెక్ట్ చేసే హైవ్ AI డిటెక్షన్ టూల్‌ను ఉపయోగించి చెక్ చేయగా, ఇది AI ద్వారా తయారు చేసిన వీడియో అని హైవే స్పష్టం చేసింది(99.7% score)

Bharath FX ఇన్‌స్టాగ్రామ్ బయోలో తను ఒక డిజిటల్ క్రియేటర్ అని ఉంది.అలాగే, 3D కంప్యూటర్ గ్రాఫిక్స్, వీడియో ఎడిటింగ్ మరియు ఫిల్మ్ మేకింగ్ అని కూడా తన బయోలో రాసి ఉంది. తన పేజీలో చాలా AI-జనరేటెడ్ వీడియోలు,ఫోటోలు ఉన్నాయి, వాటిని మీరు ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ చూడవచ్చు. 

చివరగా, రామసేతు అవశేషాలను స్కూబా డైవర్లు అన్వేషిస్తున్నట్లు చూపిస్తున్న ఈ వైరల్ వీడియో AI-ద్వారా రూపొందించబడింది, ఇది నిజమైన సంఘటన కాదు.